Hyper Aadi: జీతం వస్తే వడ్డీలకే సరిపోయేది!: ఆది

బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఆది ప్రస్తుతం ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలోనూ మరోవైపు వెండితెర సినిమాలలో కూడా అవకాశాలు అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమాలు బుల్లితెర కార్యక్రమాలలో బిజీ అయినటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన ఫ్యామిలీ పడినటువంటి ఇబ్బందులను అలాగే తన కెరీర్ గురించి కూడా పలు విషయాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ తమ తండ్రికి మేము ముగ్గురు సంతానం అని అయితే మమ్మల్ని చదివించడం కోసం మా నాన్న ఎంతో కష్టపడ్డారని అప్పులు కూడా చేశారని తెలిపారు. ఇలా అప్పు చేసి మమ్మల్ని చదివించారని నేను చదువు పూర్తి కాగానే ఉద్యోగంలోకి చేరాను. అయితే నెల అయిపోయేసరికి వచ్చే జీతం అంతా కూడా చేసిన అప్పుకు వడ్డీ కట్టడానికే సరిపోయదని ఆది తెలిపారు.. ఇలా అప్పు మాత్రం తీరకపోవడంతో తమకు ఉన్నటువంటి మూడు ఎకరాల పొలం అమ్మేస్తామని తెలియజేశారు.

ఇక మా నాన్న కూడా నాటకాలు వేసేవారని ఆయనని చూసి నేను కూడా నాటకాలపై ఆసక్తి పెంచుకొని ఇండస్ట్రీలోకి వచ్చానని ఆది తెలియజేశారు. ఇక ఈయన తన స్కిట్లకు స్క్రిప్ట్ తానే రాసుకుంటారు అనే సంగతి తెలిసిందే. దీంతో మీరు ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి హీరోగా ఎప్పుడు రాబోతున్నారు అంటూ ఈ సందర్భంగా ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయాలి అంటే సాధ్యమయ్యే పని కాదని అలా చేయాలి అంటే ప్రస్తుతం నేను కమిట్ అయిన పనులన్నీ కూడా పక్కన పెట్టాలని తెలిపారు.

ఇలా పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి తాను హీరోగా రావాలని ఎప్పుడూ అనుకోవడం లేదని ప్రస్తుతం తాను తన కమిట్మెంట్స్ తో ఎంతో బిజీగా గడుపుతున్నానని, హీరోగా రావాలనే ఆలోచన తాను అసలు చేయలేదని ఈ సందర్భంగా ఆది (Hyper Aadi) తన కెరియర్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus