Hyper Aadi: ఆదికి పెళ్లి కాకపోవడానికి ఆ దోషమే కారణమా?

  • December 11, 2023 / 02:14 PM IST

బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి హైపర్ ఆది ప్రస్తుతం బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తూనే మరోవైపు వెండితెరపై కూడా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారని తెలుస్తుంది. ఇలా వెండి తెరపై సందడి చేస్తూనే బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో ప్రతివారం ప్రేక్షకులను తన కామెడీతో అందరిని సందడి చేస్తున్నారు. ఇలా కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఆది ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు అనే విషయం మనకు తెలిసిందే.

ఈయన ఎక్కడికి వెళ్లినా తన పెళ్లి గురించి ప్రస్తావనకు వస్తుంది. అయితే తాజాగా ఈయన పెళ్లి గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఆదికి ఇప్పటివరకు పెళ్లి కాకపోవడానికి కారణం ఆయన జాతకంలో ఉన్న దోషమే కారణం అంటూ ఒక జ్యోతిష్కుడు చెప్పారు. ఆ దోషం తొలగిపోవాలి అంటే ముందుగా ఈయన ఒక వృద్ధురాలిని పెళ్లి చేసుకోవాలని చెప్పారు.

ఇలా హైపర్ ఆది ముందుగా ఒక వృద్ధురాలిని పెళ్లి చేసుకుంటే తనకు ఆదోషం తొలగిపోతుందని తరువాత మరొక అమ్మాయితో పెళ్లి చేసుకోవచ్చు అంటు జ్యోతిష్కుడు చెప్పడంతో ఆదిని పెళ్లి చేసుకోవడానికి ఏకంగా ముగ్గురు ముసలి వాళ్లు ముందుకు వచ్చారు అయితే వారిలో ఒకరిని ఆది రిజెక్ట్ చేయగా మిగిలిన ఇద్దరు కూడా ఆదినే రిజెక్ట్ చేసి వెళ్లిపోయారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇక ఇదంతా కూడా ఆది (Hyper Aadi)  శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రోమో వైరల్ గా మారింది. అయితే అది పెళ్లి గురించి ఇలా చేసినటువంటి పర్ఫామెన్స్ అందరికీ ఎంతగానో నవ్వు తెప్పించింది. ఇక ఈయన ఎప్పటిలాగే తన పంచ్ డైలాగులతో అందరిని నవ్వించారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus