ఆసక్తి కలిగించే పాత్రలే ఒప్పుకుంటా : క్యాథరిన్

అందమైన యువ ఎమ్మెల్యేగా క్యాథరిన్ సరైనోడు చిత్రంలో అదరగొట్టింది. నిండుగా చీరకట్టుకున్నా అందం అభినయంతో తెలుగు యువత గుండెల్లో వేడి పుట్టించింది. ఈ ముద్దుగుమ్మ బ్రేక్ కోసం భాషా భేదం లేకుండా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ అన్నీ భాషా చిత్రాల్లో అందాలు ఆరబోసింది. గతంలో ఇద్దరమ్మాయిలతో, పైసా వంటి చిత్రాల్లో రాని గుర్తింపు సరైనోడుతో వచ్చింది. అవకాశాలు తలుపు తట్టేటప్పటికీ అనందం తట్టుకోలేక పోతోంది. ఆలోచించి సినిమాలను ఒప్పుకుంటోంది.

“కథ వినగానే అందులో నేను ఒక భాగం కావాలనే ఆశ కలగాలి. అలా ఆసక్తి కలిగించే పాత్రలను చేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను” అని మత్తుకళ్ల సుందరి చెప్పింది. ప్రస్తుతం కేథరిన్ చేతిలో రెండు తమిళ సినిమాలున్నాయి. తెలుగులో గోపీచంద్, రానా సరసన నటించేందుకు సైన్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాలో చిరు పక్కన ప్రత్యేక పాటలో నర్తించే ఛాన్స్ కొట్టేసిన ఈ భామ మాట్లాడుతూ.. “మనం నిత్యం చూసే అమ్మాయిగా, సహజంగా నటించేందుకు వీలుగా ఉండే క్యారక్టర్ అయితే ఇష్టం.

నేను పుస్తకాలు ఎక్కువగా చదవటం వల్ల అందులోని పాత్రలు చేయాలనే కోరిక బలంగా ఉంది” అని వెల్లడించింది. పరిశ్రమలోకి వచ్చిన ఆరేళ్లకి హిట్ అందుకున్న ఈ భామ వచ్చిన విజయాన్నిఎంత వరకు సద్విని యోగించుకుంటుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus