ఎస్.ఎస్.రాజమౌళి(S. S. Rajamouli) ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టర్ అంటే అతిశయోక్తి అనిపించుకోదు. ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలతో యావత్ ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశాడు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.ఈరోజు ఇంత గొప్ప వ్యక్తిగా చెప్పుకుంటున్న రాజమౌళి ‘శాంతినివాసం’ అనే సీరియల్ తో డైరెక్టర్ గా తొలి అడుగులు వేశారు అనే విషయం బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.
ఆ సీరియల్ వల్లనే రాజమౌళికి ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ లభించింది. రాజమౌళి మాత్రమే కాదు అతని సతీమణి రమా రాజమౌళి కూడా సీరియల్ ద్వారానే పాపులర్ అయ్యారు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. కానీ ఇది నిజం.అవును రమా రాజమౌళి కూడా ఒక సీరియల్లో నటించారు. అదే ‘అమృతం’ సీరియల్. గుణ్ణం గంగరాజు తెరకెక్కించిన ఈ సీరియల్ లో రాజమౌళి సోదరుడు కాంచి, కీరవాణి సోదరుడు కళ్యాణి మాలిక్ కూడా నటించారు.
2 ఎపిసోడ్స్ లో రామా రాజమౌళి కూడా నటించారు. ఓ ఎపిసోడ్ లో ఆమె న్యూస్ రీడర్ గా కనిపించారు. అయితే దానికంటే ముందుగా ‘ఉగ్ర వీణ’ అనే ఎపిసోడ్లో రమా రాజమౌళి కనిపించారు.
ఆంజనేయులు(గుండు హనుమంతరావు) తో ఈమెకు కాంబినేషన్ సీన్ ఉంటుంది. ఇటీవల ‘అమృతం’ సీరియల్ ని రీ-మాస్టర్డ్ చేసి రోజుకి 2 ఎపిసోడ్లుగా రిలీజ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో 16వ ఎపిసోడ్లో రమా రాజమౌళి కనిపించారు.ఆ ఎపిసోడ్ థంబ్ నైల్ పై రమా రాజమౌళి ఉండటాన్ని మనం గమనించవచ్చు.