మాస్ మహారాజ్ రవితేజ 75వ సినిమాగా ‘మాస్ జాతర’ వచ్చింది. దాని ఫలితం అందరికీ తెలిసిందే. అటు తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఆ వెంటనే మరో సినిమా చేయడానికి రవితేజ ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది. పూజా కార్యక్రమాలు వంటి ఎటువంటి హడావిడి లేకుండానే ఈ సినిమా ప్రారంభం అయిపోయింది అని తెలుస్తుంది.
ప్రస్తుతం కొంత గ్యాప్ ఇచ్చారు. జనవరి నుండి మరో షెడ్యూల్ కూడా మొదలుపెట్టేస్తారు అని టాక్. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఇప్పటివరకు అతను తీసినవన్నీ ప్రేమకథలే. ‘టక్ జగదీష్’ వంటి మాస్ ప్రయత్నం చేసినా అది బెడిసికొట్టింది. అయితే ఈసారి ఓ రియల్ ఇన్సిడెంట్ ను తీసుకుని ఓ థ్రిల్లర్ స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడట.ఇదిలా ఉండగా ఈ సినిమాకి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
అందుతున్న సమాచారం ప్రకారం.. రవితేజ- శివ నిర్వాణ సినిమాకి ‘ఇరుముడి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. రవితేజకి ఉన్న మాస్ ఇమేజ్ కి ఏమాత్రం సంబంధం లేని టైటిల్ ఇది. కథని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టినట్టు స్పష్టమవుతుంది. అందువల్ల ఆడియన్స్ ని మొదటి నుండి ప్రిపేర్ చేసినట్టు కూడా అవుతుంది అనేది మేకర్స్ ఆలోచనగా తెలుస్తుంది.
ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా ఎంపికైంది. ‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా 2026 సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రవితేజ ఈ సినిమాకు బల్క్ డేట్స్ ఇచ్చాడు. పారితోషికం తీసుకోకుండా ప్రాఫిట్ షేరింగ్ పద్దతిలో రవితేజ ఈ సినిమాకి పనిచేస్తున్నారట.