Avatar 3: మూడో ‘అవతార్‌’కి వెళ్తే.. మీకు మరో మూడు సర్‌ప్రైజ్‌లు

ప్రపంచ సినిమాలో ది బెస్ట్‌ అంటూ ఓ లిస్ట్‌ రాస్తే.. అందులో కచ్చితంగా, వీలైతే టాప్‌లో వచ్చే సినిమాల్లో ‘అవతార్‌’ కచ్చితంగా ఉంటుంది. జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన ఈ సినిమా నుండి రెండు భాగాలు వచ్చిన భారీ విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు మూడో పార్ట్‌ కోసం సర్వ సిద్ధం చేస్తున్నారు. ‘అవతార్: ది ఫైర్ ఆండ్ యాష్’ పేరుతో ఈ సినిమాను డిసెంబరు 19న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు వచ్చేవారికి మూడు సర్‌ప్రైజ్‌లు ఉంటాయని సమాచారం వస్తోంది.

Avatar 3

‘అవతార్‌ 3’ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న మూడు భారీ సినిమాల ట్రైలర్లు ప్రదర్శించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఆ సినిమాల కోసం మన దేశంలో కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిస్టోఫర్ నోలన్ ‘ఒడెస్సి’, అవెంజర్స్ ఫ్రాంచైజ్ నుండి ‘అవెంజర్స్ – డూమ్స్ డే’, స్టీవెన్ స్పీల్ బర్గ్ ‘యు.ఎఫ్.ఒ’ సినిమాల ట్రైలర్‌లే ‘అవతార్‌ 3’తో రానున్నాయని సమాచారం. అయితే మరి మన దేశంలో రిలీజ్‌ చేస్తారా అనేది చూడాలి.

ఇక ‘అవతార్‌ 3’ సినిమా విషయానికొస్తే.. సామ్‌ వర్తింగ్టన్‌, జోయ్‌ సాల్డ్నా, సిగౌర్నీ వీవర్‌, స్టీఫెన్‌ లాంగ్‌, కేట్‌ విన్‌స్లెట్‌ ప్రధాన పాత్రధారులు. ఇప్పటికే విడుదలైన రెండు ‘అవతార్‌’లు భారీ వసూళ్లు అందుకున్నాయి. ‘అవతార్‌’ సినిమాకు 2.9 బిలియన్ల డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఇక రెండో ‘అవతార్‌’ సినిమాకు 2.3 బిలియన్ల డాలర్ల వసూళ్ల వచ్చాయి. ఇప్పుడు మూడో పార్టుకి ఎలాంటి వసూళ్లు వస్తాయో చూడాలి. ఇదిలా ఉండగా ఈ ఫ్రాంచైజీలో ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి. నాలుగో ‘అవతార్‌’ 2029 డిసెంబరులో రానుండగా.. ఐదో అవతార్‌ 2031 డిసెంబరులో వస్తాయి. అయితే మూడో సినిమా ఫలితం బట్టే ఆ రెండు సినిమాలు ఉంటాయని చెప్పొచ్చు.

హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus