నేను కూడా రామ్ గోపాల్ వర్మ టైపే – జగపతి బాబు
- February 19, 2016 / 09:19 AM ISTByFilmy Focus
జగపతి బాబు కూతురు మేఘన పెళ్లి ఓ అమెరికన్ కుర్రాడితో జరిగిన విషయం తెలిసిందే. తాజాగా కమ్మ, కాపు, అంటూ కుల, జాతి విభేదాలు సరికావు అంటూ జగపతి ఫైర్ అయ్యారు. ఇలాంటి కుల విభేదాలు అన్నీ ట్రాష్ అన్నారు. తన వ్యక్తిగత, కుటుంబ విషయాల్లో కుల విభేదాలు లేవని తేల్చి చెప్పారు.
అందుకు నిదర్శనమే ఆయన కూతురు అమెరికన్ కుర్రాడితో ప్రేమ వివాహం. ఇంటి పేరునే పట్టించుకోని నేను కులం గురించి ఎలా ఆలోచిస్తాను అంటూ ప్రశ్నించారు. ఇవి మనం సృష్టించినవి కావు..మరి వాటిని పట్టించుకునే అవసరం లేదన్నారు.
కాగా, కొందరు గిట్టని కమ్మ స్నేహితులు యూఎస్ లో తన అల్లుడిని డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.. అలా చేస్తే విడిపించడానికి తనకి జీవిత కాలం పడుతుందంటూ నవ్వేశారు. ముక్కుసూటిగా మాట్లాడే విషయం లో తాను రాంగోపాల్ వర్మ టైపని అన్నారు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













