“నా పాత్ర నిడివి ఎంత? మరో కథానాయిక ఎంత సేపు కనిపిస్తుంది? ఎవరికి ఎక్కువ పాటలున్నాయి. అదీ… ఇదీ… ఇద్దరికీ… అంటూ లెక్కలు వేసుకోను” అంటోంది సమంత. ఇటీవల ప్రతి చిత్రంలోనూ ఇద్దరు ముగ్గురు అందాల భామలు నటించడం సహజమైంది. మరో కథానాయికతో కలసి వెండితెరను పంచుకోవడనికి సమంతకు ఎటువంటి అభ్యంతరమూ లేదట. మహేష్ ‘బ్రహ్మోత్సవం’లో కాజల్ అగర్వాల్, ప్రణీతలతో కలసి నటిస్తుందీ భామ.
ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’, సూర్య ’24’ చిత్రాల్లో సమంతతో పాటు నిత్యా మీనన్ మరో కథానాయికగా కనిపిస్తుంది. ఇంకొకరితో కలసి తెరను పంచుకోవడం ఇబ్బందిగా ఉందా? అని అడిగితే.. “తెరపై రెండున్నర గంటలూ కనిపించాలనే కోరికలు నాకు లేవు. అటువంటి వాటికి దూరం పాటిస్తాను. నా పాత్ర చిన్నదైనా, ప్రేక్షకులపై ప్రభావం చూపే విధంగా ఉండాలి. కంటెంట్ బేస్డ్ స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడతాను” అని చెప్పింది సమంత. చిత్రాల ఎంపికలో నా ప్రాధాన్యత దర్శకుడు, కథ, తర్వాతే కథానాయకుడు అని ముందునుంచీ చెప్తున్నాను. నా విజయ రహస్యం ఇదే. ఇప్పటివరకూ నా లెక్క ఎప్పుడూ తప్పు కాలేదు అంటోంది.