బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా జరిగాయి. హౌస్ మొత్తం ఒకవైపు అరియానా మరోవైపు నిలబడిపోయింది. హౌస్ లో ఒక్క అవినాష్ తప్పించి మిగతా హౌస్ మేట్స్ అందరూ అరియానాని నామినేట్ చేశారు. అంతేకాదు, అరియానా గేమ్ గురించి, టాస్క్ ఆడిన విధానం, కెప్టెన్సీ చేసిన పద్దతి వీటన్నింటిని గురించి మాట్లాడుతూ నామినేట్ చేసేసరికి అరియానా తట్టుకోలేకపోయింది. అంతేకాదు, చిన్న చిన్న విషయాలని కూడా చూపిస్తూ నామినేట్ చేస్తున్నారని, హౌస్ మొత్తం కలిపి టార్గెట్ చేశారని చెప్తూ అవినాష్ దగ్గర బాధపడింది.
నిజానికి నామినేషన్స్ కి ముందురోజు రాత్రి కెమెరా ముందుకు వచ్చి అరియానా చాలాసేపు బాధపడింది. అమ్మరాజశేఖర్ మాస్టర్ వెళ్లిపోయిన తర్వాత అరియానా నన్ను ఎందుకు ఒంటరిని చేస్తున్నారు బిగ్ బాస్ అంటూ ఏడ్చేసింది. హౌస్ లో అందరూ తనకి ఎగైనిస్ట్ అయ్యారని ముందుగానే ఊహించింది. బోల్డ్ గా ఉంటానని చెప్తాను కానీ, నేను బోల్డ్ కాదు ఆ ట్యాగ్ నాకొద్దు తీసేస్కోండి అని చెప్పింది. అంతేకాదు, హౌస్ లో అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారని, హౌస్ లో ఉండాలని అనిపించడం లేదని చెప్పింది. అరియానా ఊహించినట్లుగానే అరియానాని హౌస్ మొత్తం కలిపి నామినేట్ చేసేశారు. దీంతో బాధని తట్టుకోలేకపోయింది.
మెహబూబ్ నుంచి మొదలుపెడితే మోనాల్ వరకూ అరియానానే మొదట నామినేట్ చేశారు. మద్యలో అవినాష్ మిస్ చేశాడు అంతే. ఇక కొసమెరపు ఏంటంటే, లాస్య బాటిల్ ని తలపై గట్టిగా కొట్టిందని చాలా పైయిన్ వచ్చిందని అయినా కూడా తట్టుకుని అక్కడే ఉన్నానని కూడా అవినాష్ తో చెప్పుకుని బాధపడింది అరియానా.