సినిమా హీరోహీరోయిన్లాక పార్టీల పేరిట పబ్బులు, రిసార్టులకు మాత్రమే కాక దేశవిదేశాలకు తెగ తిరుగుతుంటారు. కానీ.. బొద్దుగుమ్మ రాశీఖన్నా మాత్రం “నేనస్సలు పార్టీలకు వెళ్ళను.. ఇంట్లో గమ్మున కూర్చొని పుస్తకాలు చదువుకుంటా”నంటోంది.
అసలు రాశీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతుందా అని ఆరా తీయగా.. ఈమధ్య రాశీఖన్నా గురించి పలు వెబ్ సైట్లు “రాశీ మాంచి పార్టీ గర్ల్” అని రకరకాల ఆర్టికల్స్ వ్రాసిందట. ఆ కథనాలు చదివి తన కుటుంబ సభ్యులు సీరియస్ అయ్యారట. అందుకే పనిగట్టుకొని మరీ “నేను పార్టీ గర్ల్ ని కాదు” అని వివరణ ఇస్తోంది!