నిత్య హైట్ నాకు ప్రాబ్లం కాదు : సందీప్ కిషన్
- May 10, 2016 / 12:52 PM ISTByFilmy Focus
“ఈ అమ్మాయి ఇంకొంచెం హైట్ ఉండి ఉంటే.. ఎంత బాగుండేది” నిత్యామీనన్ అనే పేరు తలచుకోగానే ప్రతి ఒక్కరి మనసులో మెదిలే ప్రశ్న ఇది. అద్భుతమైన నటి, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అయిన నిత్యామీనన్ కేవలం హైట్ ప్రాబ్లం వల్ల స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకోలేకపోతోంది.
అయితే.. “ఆమె హైట్ తో నాకు ఎటువంటి సమస్య లేదు” అంటున్నాడు ఆమెతో “ఒక్క అమ్మాయి తప్ప” చిత్రంలో కలిసి నటిస్తున్న యువ కథానాయకుడు సందీప్ కిషన్. నిత్యామీనన్ నటనను చూస్తుంటే.. ఆమె హైట్ గురించి ఎవరూ పట్టించుకోరు. అంటు సమాధానమిచ్చాడు సందీప్. మరి వీరిద్దరి జంట ఎలా ఉంటుందో తెలియాలంటే.. సినిమా విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















