తన డ్రెస్సింగ్ పై వస్తున్న ట్రోల్స్ కు స్పందించిన జాన్వీ కపూర్..!

ఈమధ్య సోషల్ మీడియాలో కొందరి నెటిజెన్ల తీరు మరీ ఘోరంగా తయారవ్వుతుంది. కొంతమంది సెలెబ్రిటీలను వారు అభినందించిన, పుట్టినరోజుకు పండక్కో శుభాకాంక్షలు చెప్పినా, పోనీ వాళ్ళు చాట్ సెషన్ పెట్టినప్పుడు ప్రశ్నలడిగినా ఏమాత్రం తప్పుకాదు. ఆ సెలబ్రిటీ సినిమా, లేదా యాక్టింగ్ నచ్చలేదు అని చెప్పినా పర్వాలేదు కానీ అంతకు మించి వారి పర్సనల్ విషయాల్లో కల్పించుకుంటూ కొందరు కామెంట్లు పెడుతుండటం… కచ్చితంగా వారు ఆలోచించుకోవాల్సిన విషయమే అనడంలో సందేహం లేదు. ఇక అసలు విషయం ఏమిటంటే… బాలీవుడ్ నటి, శ్రీదేవి కూతురు, జాన్వీ కపూర్ వేసిన బట్టలు మళ్ళీ వేస్తుందని.. ఇటీవల సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ”వేసిన బట్టలే మళ్లీ వేసుకున్తున్నావ్.. ఇది హీరోయిన్ లక్షణం కాదు.. ఏంటా గెటప్” అంటూ ఆమె పై కామెంట్లు చేసారు..!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ ఈ విషయం పై స్పందించింది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ… “అందరికీ ఆనందపరచడం, మెప్పించడం ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. డ్రెస్సింగ్ గురించి నా పై వస్తున్న విమర్శలను సీరియస్ గా తీసుకోలేను. నటించడం నా ప్రొఫెషన్..!దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తా.బయట ఎలా కనిపించాలనేది..? ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది..? నా ఇష్టం. ప్రతీరోజూ కొత్త బట్టలు వేసుకునేంత డబ్బు నేనింకా సంపాదించడం లేదు” అంటూ ధీటుగా బదులిచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus