నేనేంటో నాకు తెలుసు : సాయి పల్లవి

“ప్రేమమ్ (మలయాళం)” సినిమా ద్వారా సాయి పల్లవి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అచ్చమైన మలయాళీగా నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగులో ఫిదా మూవీ చేసింది. ఇందులో అచ్చమైన తెలంగాణ అమ్మాయి భానుమతిలా నటించి అందరి మనసులు గెలుచుకుంది.  రీసెంట్ గా మిడిల్ క్లాస్ అబ్బాయి లోను నాని కి జోడిగా చలాకీగా నటించి టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చింది. విభిన్నమైన కథతో చేసిన ద్వి భాష చిత్రం “క‌ణం” త్వరలో థియేటర్లోకి రానుంది. ఇందులో ఓ ప‌సిపాప‌కు సాయిప‌ల్ల‌వి త‌ల్లిగా న‌టించింది. హీరోయిన్ గా మంచి ఫామ్లో ఉన్న సమయంలో ఈ రోల్ ఒప్పుకోవడంపై అనేకమంది విమర్శలు చేశారు.

కెరీర్ ఇబ్బందులో పడిపోతుందని సలహాలు ఇచ్చారు. వారందరికీ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో గట్టిగా సమాధానం ఇచ్చింది. “మిగ‌తా హీరోయిన్ల‌లా నాకు అన్ని పాత్ర‌లూ న‌ప్ప‌వు. నా హ‌ద్దులేంటో, నా బల‌హీన‌త‌లేంటో నాకు తెలుసు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలోని హీరోయిన్ పాత్రలు నాకు సూట్ కావు. అందుకే విభిన్న‌మైన‌, న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌లు ఎంచుకుంటున్నా” అని సాయిప‌ల్ల‌వి స్పష్టం చేసింది.  అంతేకాదు.. తాను ఏ హీరోయిన్ కి పోటీ కాదని వెల్లడించింది. మనసులో ఉన్నదీ ఉన్నట్టు మాట్లాడి.. సినీ ప్రముఖులను సైతం సాయి పల్లవి తన అభిమానులుగా మార్చుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus