సూర్య పై సంచలన కామెంట్లు చేసిన యాషికా..!

‘ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు’ అనే తమిళ చిత్రంలో చేసిన అసభ్య సన్నివేశాలు, ‘బిగ్ బాస్’ సీజన్ 2లో అభ్యంతరకరమైన దుస్తులతో ఎక్కడాలేని పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ యాషికా ఆనంద్. తాజాగా ఇప్పుడు మరోసారి వివాదాలకు తెర లేపింది. గతంలో నటుడు మహత్‌ ను ప్రేమిస్తున్నానని చెప్పి, రచ్చ చేసిన యషిక… కరెన్సీ నోటుపై ఆటోగ్రాఫ్ పెట్టి వివాదాలను కొనితెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే… ఇటీవల ఫ్యాన్స్ తో ట్విట్టర్ ద్వారా ముచ్చటించింది… ఈ భామ. ఇందులో భాగంగా… ఒక అభిమాని మీకు హీరో సూర్య అంటే ఇష్టమా అని అడగ్గా… అందుకు సూర్య ఫొటోను పోస్ట్‌ చేసి, తనని పెళ్ళాడాలని ఆశపడుతున్నట్లు కామెంట్ చేసి మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. దీంతో యాషికా వ్యాఖ్యలపై సూర్య అభిమానులు నిప్పులు చెరుగుతుండగా, నటి జ్యోతిక ఫ్యాన్స్ కూడా ఆగ్రహంతో రగిలిపోతుండడం సంచలనంగా మారింది.

సూర్యకు పెళ్ళయ్యి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్న సంగతి యాషికాకి తెలియదా? అంటూ ఆమె పై మండిపడుతున్నారు. సూర్యను పెళ్ళాడాలని ఎలా అంటుందంటూ అటు సూర్య అభిమానులతో పాటూ జ్యోతిగా అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ అయ్యింది. మరి ఇది ఎలాంటి పరిణామాలపై దారి తీస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus