ఆ డైరెక్టర్ నాకు ఒకటి చెప్పి…మరొకటి తీసాడు : నయన తార

  • May 9, 2019 / 05:02 PM IST

ఓ సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ చిన్న పాత్ర చేసినా.. ఆమెకు మంచి పేరు రావడం ఖాయం. ఒక వేళ ఆ హీరోయిన్ కు పేరు రాకపోయినా పలానా సూపర్ హిట్టు సినిమాలో చేసానని గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది. అయితే మన నయనతార మాత్రం ఓ సూపర్ హిట్ చిత్రంలో నటించినందుకు చాలా బాధపడుతుంది. ఇప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న నయనతార ఓ గతంలో ‘గజినీ’ అనే సూపర్ హిట్ చిత్రంలో నటించింది. చెప్పాలంటే ఈ చిత్రం తర్వాతే ఈ బ్యూటీకి మంచి ఆఫర్లు రావడం మొదలయ్యాయి.

ఈ చిత్రంలో అశిన్ మెయిన్ హీరోయిన్ గా నటించగా.. నయన్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో నయన్ పోషించిన పాత్రపై కొన్ని కామెంట్లు చేసింది. తనకు డైరెక్టర్ నెరేట్ చేసిన పాత్రకు స్క్రీన్ పై కనిపించిన పాత్రకు అస్సలు సంబంధం లేదట. ఈ చిత్రం తర్వాత పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నట్టు తెలిపింది. అసలు డైరెక్టర్ మురుగదాస్ అలా ఎందుకు చేశాడో తెలీదని.. ఇంకా ‘చంద్రముఖి’ చిత్రంలో చిన్న పాత్ర చేసిననప్పటికీ మంచి పేరు వచ్చిందని, అలానే ‘శివకాశి’ సినిమాలో ఒక పాట మాత్రమే చేసినా.. అది కూడా తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిందని తన బాధను చెప్పుకుంటూ వచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus