తన19 వ మూవీ టైటిల్, టీజర్ పై క్లారిటీ ఇవ్వనున్న ప్రభాస్

  • April 17, 2017 / 08:13 AM IST

బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రానికి దాదాపు టెక్నీషియన్లు, ఆర్టిస్టుల ఎంపికను పూర్తి చేశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ సాహో టైటిల్ ఫిక్స్ చేశారని, బాహుబలి 2  తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేస్తారని.. రోజుకో న్యూస్ బయటికి వస్తోంది. అయితే అవేవి చిత్ర బృందం అధికారికంగా ప్రకటించినవి కాదు. ఇదే విషయాన్నీ ప్రభాస్ ముందు విలేకరులు ఉంచారు. ఆయన బాహుబలి 2 ప్రమోషన్లో భాగంగా తెలుగు మీడియాకు ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో తన నెక్స్ట్ సినిమాపై వస్తున్న రూమర్లపై స్పందించారు.

“సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా గురించి మేము పనిచేస్తున్న సంగతి నిజమే,  మరో మూడు రోజుల్లో ఆ మూవీ  పేరు, టీజర్ విషయాలపై క్లారిటీ ఇస్తాను” అని చెప్పారు.  ప్రభాస్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందనా హీరోయిన్ గా ఎంపికైంది. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు డార్లింగ్ ఫిల్మ్ కి సంగీతాన్ని అందించనున్నారు. మరిన్ని వివరాలు అధికారికంగా త్వరలో తెలియనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus