అవార్డు వార్తలపై స్పందించిన ఇళయరాజా!

  • January 21, 2021 / 08:27 AM IST

తన జాతీయ, రాష్ట్ర అవార్డులను ఇళయరాజా వెనక్కి ఇచ్చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్పందించారు. అవార్డు వాపసు వార్తలన్నీ వదంతులే అని కొట్టిపారేశారు. ఇళయరాజా, ప్రసాద్‌ స్టూడియోకు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం సాగుతోంది. ఈ విషయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయన అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్నారనే పుకార్లు వచ్చాయి. ‘‘ఎన్నో సంవత్సరాలుగా నేను పొందిన అవార్డులు ఇవి. వాటిని వెనక్కి ఇచ్చేస్తున్నాంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఈ విషయం ఇటీవల నా దృష్టికి వచ్చింది. అసలు ఆ వార్తలు ఎలా పుట్టాయో అర్థమే కావడం లేదు. నా గురించి వస్తున్న ఆ వార్తలన్నీ నిరాధారమైనవే’’ అంటూ ఇళయరాజా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చెన్నైలోని ప్రసాద్‌ స్టూడియోస్‌ యాజమాన్యానికి, ఇళయరాజాకు మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. స్టూడియోలోని రికార్డింగ్‌ థియేటర్‌ను వాడుకోమని స్టూడియో వ్యవస్థాపకుడు ఎల్వీ ప్రసాద్‌ తనకు మాట ఇచ్చారని ఇళయరాజా వాదిస్తున్నారు. అయితే ప్రస్తుత యాజమాన్యం దానికి అంగీకారం తెలపడం లేదట.

ఈ నేపథ్యంలో స్టూడియోలోకి తనను రానివ్వడం లేదని ఇళయారాజా కొన్ని నెలల క్రితం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుత యాజమాన్యం తనకు ₹ 50 లక్షల పరిహారం చెల్లించాలని పిటిషన్‌లో ఇళయారాజా. అయితే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకూ కోర్టు సూచించింది. దానికి తగ్గట్టుగా ఇటీవల ఇళయరాజా స్టూడియోను ఖాళీ చేశారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus