సినిమాలో హీరో, హీరోయిన్, విలన్.. ఇలా ఎన్నో పాత్రలుంటాయి. కానీ కొన్ని పాత్రలు మన వెంట వస్తాయి. మనసులో ముద్ర పడిపోతాయి. 2017 సంవత్సరంలో విడుదలైన సినిమాల్లోని అద్భుతమైన పాత్రలపై ఫోకస్…
పోసాని కృష్ణ మురళి (నేను లోకల్ )“నేను లోకల్” మూవీ లో బాగా గుర్తుండి పోయేది పోసాని చేసిన తండ్రి క్యారెక్టర్. కామెడీ, సెంటిమెంట్ కలగలిపి పోసాని అద్భుతంగా నటించారు. మా నాన్న కూడా ఇలా ఉంటే ఎంత బాగుండు అని ప్రతి ఒక్క స్టూడెంట్ అనుకునేలా ఉంటుంది పోసాని రోల్.
కే కే మీనన్ (ఘాజి)రానా హీరోగా చేసిన “ఘాజి ” మూవీ లో సిన్సియర్ కెప్టెన్ గా మీనన్ నటన అమోఘం. అతను కథపై ఆసక్తి తీసుకురావడానికి దోహదహ పడ్డారు.
అజయ్ & రావు రమేష్ ( కాటంరాయుడు )“కాటమరాయుడు ” మూవీ లో పవన్ కళ్యాణ్ తర్వాత అందరికి గుర్తుండిపోయేది అజయ్ రోల్. అలాగే రావు రమేష్ శాడిస్ట్ విలన్ గా చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. కానీ అజయ్ పవన్ కళ్యాణ్ తో కామెడీ & సెంటిమెంట్ సీన్స్ భలే ఉంటాయి.
ఇషా కొప్పికర్ (కేశవా)“చంద్రలేఖ” సినిమాతో తెలుగు వారికీ పరిచయమైన ఇషా కొప్పికర్ మళ్లీ తెలుగులో “కేశవ” మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది. 16 ఏళ్ళ తర్వాత వచ్చినా అందం అభినయంతో ఆకట్టుకుంది.
వెన్నెల కిషోర్ (అమీ తుమీ )“అమీ తుమీ”లో వెన్నెల కిషోర్ ని చూసాక నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మానందం అని అందరూ భావించారు. షాక్ తో పెరలాసిస్ వచ్చే సీన్స్ కి థియేటర్ లో జనాలు పగలబడి నవ్వారు.
జగపతి బాబు (పటేల్ సర్ )కాస్త గ్యాప్ తర్వాత జగ్గు భాయ్ చాలా ఇష్టపడి చేసిన సినిమా “పటేల్ సర్”. 60 ఏళ్ళ ఆర్మీ మాన్ గా జగ్గు భాయ్ పెర్ఫార్మన్స్ పీక్స్ లో ఉంటాయి.
శరణ్య & సాయి చంద్ (ఫిదా)“ఫిదా” అనే సినిమా పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చేది సాయి పల్లవి రోల్ అయినా.. సినిమా లో సాయి పల్లవి తో సమానంగా శరణ్య & సాయి చంద్ కి పేరు వచ్చింది. అక్క రోల్ లో శరణ్య, తండ్రి పాత్రలో సాయి చంద్ సహజంగా నటించి మనసులో స్థానం సంపాదించుకున్నారు.
గోపీచంద్ (గౌతమ్ నంద )గౌతమ్ నంద లో గోపీచంద్ చేసిన విలన్ రోల్ బాగా ఆశ్చర్యపరిచింది. ఎవ్వరూ ఊహించని విధంగా గోపిచంద్ నటన ఆకట్టుకుంది.
షకలక శంకర్ (ఆనందో బ్రహ్మ)షకలక శంకర్ వల్ల “ఆనందో బ్రహ్మ” హిట్ అయ్యింది అని సామాన్య ప్రేక్షకుడిని అడిగినా చెప్తారు. ఆ
రేంజ్ లో అతని నటన, కామెడీ టైమింగ్ & డాన్స్ మూమెంట్స్ ఉంటాయి.
రాహుల్ రామ కృష్ణ (అర్జున్ రెడ్డి)“నీతో ఫ్రెండ్ షిప్ చేస్తే నా మీద నా మూత్రం పోసుకున్నట్లు ఉంటది” అని తెలంగాణ స్లాంగ్ లో రాహుల్ రామకృష్ణ చెప్పే డైలాగ్స్ ఎంత పేలాయో.. ఒక ఫ్రెండ్ గా అర్జున్ రెడ్డికి ఎప్పుడు సపోర్ట్ చేసిన క్యారెక్టర్ కూడా అదే రేంజ్ లో హైలైట్ అయ్యింది.
రాశి (లంక)కొన్నేళ్ల గ్యాప్ తర్వాత “లంక” అనే మూవీలో రాశి తల్లి పాత్రలో జీవించారు. “లంక” హిట్ కాకపోవడంతో ఆమెకి మంచి పేరు రాలేకపోయింది.
శ్రీకాంత్ (యుద్ధం శరణం)శ్రీకాంత్ “యుద్ధం శరణం” చిత్రంలో విలన్ గా అదరగొట్టారు. ఇది అతని కెరీర్ లో మంచి పాత్రగా నిలిచి పోయింది.
శివాజీ రాజా (మెంటల్ మదిలో)కొడుకుతో ఎలా ఉంటే, ఎలా మాట్లాడితే హ్యాపీ గా, ఉంటాడో మెంటల్ మదిలో చేసి చూపించారు శివాజీ రాజా. మనకి కూడా ఇలాంటి నాన్న ఉంటే మంచిదని అనిపిస్తుంది.
అనిషా విక్టర్ (గృహం)గృహం సినిమాలో అనిషా విక్టర్ కి తొలి సినిమా అయినప్పటికీ అనుభవం ఉన్నా వారిలా నటించారు.
ఎస్ జె సూర్య (స్పైడర్) స్పైడర్ సినిమాలో “భైరవ “గా ఎస్ జె సూర్య భయపెట్టారు. మెట్రో పిల్లర్స్ దగ్గర జనాలు అందరూ ఏడుస్తున్నప్పుడు ఎస్ జె సూర్య వాళ్ళ బాధని ఎంజాయ్ చేస్తూ ఇచ్చే ఎక్సప్రెషన్ సూపర్.