‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా పరిచయం అవసరం లేని పేరు. రాంగోపాల్ వర్మ వల్ల ఈమె బాగా ఫేమస్ అయ్యింది..! అంతకు ముందు ‘ఏవమ్ జగత్’ ‘బుజ్జి ఇలా రా’ ‘నటరత్నాలు’ ‘క్రాంతి’ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఆర్జీవీతో కలిసి చేసిన బోల్డ్ డ్యాన్స్ వీడియో వల్ల ఈమె కెరీర్ మారిపోయింది.దాని వల్లే ఈమెకు ‘బిగ్ బాస్ సీజన్ 6’ ఛాన్స్ లభించింది. ఆ సీజన్లో ఈమె గేమ్ బాగానే ఆడింది.
అందువల్ల ఈమె క్రేజ్ కూడా పెరిగింది అని చెప్పొచ్చు. అయితే టాప్ 5 కంటెస్టెంట్ గా నిలుస్తుంది అనుకుంటే..! అలా జరగలేదు. పోనీ సినిమాల్లో నటించే అవకాశాలు అయినా పెరుగుతాయా? అంటే అది కూడా లేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. నిన్న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆమె వ్రతం ఆచరించినట్లు ఫోటోలు షేర్ చేసింది.చీర కట్టులో ఆమె చాలా చక్కగా ఆ ఫొటోల్లో కనిపించింది. అయితే ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు (Inaya Sultana) ఈమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఎందుకంటే.. ‘ఈమె ముస్లిం అయ్యుండి వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఏంటి?’ అంటూ ఈమెను తిడుతూ రెచ్చిపోయారు. అందుకు ఈమె ‘నేను ముస్లిం అయితే మీకు వచ్చిన సమస్యేంటి? హిందూ అయితే మీకేంటి? నేను ఇండియన్ అనే విషయం మీకు గుర్తులేదా. దాన్ని మర్చిపోకండి’ అంటూ ఆమె మండిపడింది. దీంతో ఈ టాపిక్ వైరల్ గా మారింది.
గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!
బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!