Inaya, Shrihan, Revanth: నోరు జారిన ఇనయ..! ఇయనపై విరుచుపట్ట శ్రీహాన్ , రేవంత్..!

బిగ్ బాస్ హౌస్ లో అసలు సిసలైన టాస్క్ మొదలైంది. మూడోవారం బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ని ఇచ్చాడు. అడవిలో ఆట అంటూ గార్డెన్ ఏరియాని అడవిగా మార్చాడు. హౌస్ మేట్స్ లో రేవంత్, శ్రీహాన్, ఆర్జే సూర్య, సుదీప, వాసంతీ, ఆరోహి, కీర్తి, నేహా , అర్జున్ లని దొంగలుగా మార్చాడు. ఆదిరెడ్డి, చంటి, బాలాదిత్య, రాజ్, మెరీనా, రోహిత్, ఫైమా ఇంకా ఇనయలని పోలీసులని చేశాడు. గీతు ని మాత్రం అత్యాశ గల వ్యాపారిగా మారమని ఆర్డర్ వేశాడు. దీంతో హౌస్ లో టాస్క్ మొదలైంది.

బిగ్ బాస్ సమయానుసారం ఇచ్చే సౌండ్స్ ని ఫాలో అవుతూ దొంగలు దొంగతనం చేయాలి. పోలీసులు ఇంటిని సోదా చేయాలి. అలాగే, వ్యాపార లావాదేవీలు కూడా వ్యాపారి అయిన గీతుతో చేయాలి. ఈ టాస్క్ లో రెండు టీమ్స్ రెచ్చిపోయి మరీ పెర్ఫామ్ చేశాయి. గార్డెన్ ఏరియాలో ఇనయని తోసేసి మరీ శ్రీహాన్ అడవిలో వస్తువులని లాగేశాడు. దీంతో ఇనయ ఫైర్ అయ్యింది. వాడు తీస్కుని వెళ్లాడు అడుగు అంటూ శ్రీహాన్ ని వాడు అన్నది.

నన్ను వాడు అనడం ఏంటి అంటూ రెచ్చిపోయాడు శ్రీహాన్. వెంటనే రేవంత్ కూడా ఇనయాకి ఫుల్ క్లాస్ పీకుతూ అరిచాడు. ఒక్కటి పీకాల్సింది అంటూ చేయి కూడా చూపించాడు. ఇదంతా ప్రోమోలో ఆసక్తిగా చూపించాడు బిగ్ బాస్. మరి ఆటలో ఏంజరిగింది ? అసలు శ్రీహాన్ రేవంత్ అంతలా ఇనయపై ఎందుకు ఫైర్ అయ్యారు అనేది తెలియాలి.

ఈ టాస్క్ ఇప్పుడు హౌస్ మేట్స్ మద్యలో చిచ్చుపెట్టేలాగానే కనిపిస్తోంది. ఒకవైపు ఆదిరెడ్డి పోలీసులకి లీడర్ గా వ్యవహరిస్తూ గేమ్ ప్లాన్ వేస్తున్నాడు. మరోవైపు దొంగలకి లీడర్ గా ఆర్జే సూర్య కూడా వస్తువులని ఎక్కడ దాచి ఉంచాలో ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ టాస్క్ లో దొంగ – పోలీస్ ఆటలో ఏ టీమ్ గెలిచింది అనేది తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే. అదీమేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus