Shankar, Kamal Haasan: మొత్తానికి శంకర్ కి లైన్ క్లియర్ అయింది!

దక్షిణాదిలో ఉన్న అగ్ర దర్శకుల్లో శంకర్ ఒకరు. తన కెరీర్ లో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించారాయన. అయితే ఈ మధ్యకాలంలో ‘ఇండియన్ 2’ సినిమా వివాదాలతో వార్తల్లోకెక్కారు శంకర్. నిర్మాత సంస్థ లైకాతో శంకర్ కి విబేధాలు తలెత్తాయి. ఈ విషయం కోర్టు వరకు వెళ్లింది. దీంతో సినిమా అసలు పూర్తవుతుందా అనే సందేహాలు కలిగాయి. కానీ ఇప్పుడీ గొడవ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియన్ 2 సినిమా సెట్ లో యాక్సిడెంట్ జరగడంతో కొందరు చనిపోయారు.

దీంతో సినిమాకి బ్రేక్ వచ్చింది. కేసులు, కోర్టులంటూ షూటింగ్ వాయిదా పడింది. ఈలోగా శనకర్ రామ్ చరణ్ తో ఓ సినిమా, రణవీర్ సింగ్ తో మరో సినిమా అనౌన్స్ చేశారు. దీంతో నిర్మాణ సంస్థ లైకా గొడవకు దిగింది. కానీ శంకర్ మాత్రం సినిమా ఆలస్యం కావడానికి కారణం తను కాదని.. ఆ బాధత్య నిర్మాతలదే అని అన్నారు. లైకా మాత్రం తమ సినిమాను పూర్తి చేసిన తరువాత మిగిలిన సినిమాలు చేసుకోమని పట్టుబట్టింది.

అయితే రీసెంట్ గా జరిగిన హియరింగ్ లో కోర్టు ఒక సలహా ఇచ్చింది. ఇరు వర్గాల వైపు బలమైన సాక్ష్యాలు ఉన్నాయని.. దీన్ని గొడవ చేసుకోకుండా ఓ ఒప్పందానికి వస్తే మంచిదని చెప్పింది. దీంతో శంకర్-లైకా ఒప్పందం చేసుకోవడానికి ముందుకొచ్చారు. వీలైనంత త్వరగా ఆ రెండు సినిమాలను పూర్తి చేసి.. తమ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని.. లైకా చెప్పడంతో.. శంకర్ తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారట. కాబట్టి ‘ఇండియన్ 2’ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడినట్లే!

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus