ఇండియాకి వరల్డ్ కప్ తెప్పించిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. ఇప్పుడు ఈయన కుమార్తె అమియా త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయబోతుందట. 1983లో భారత్ తొలిసారి ప్రపంచ కప్ ను గెలవడంలో అప్పటి కెప్టెన్ అయిన కపిల్ దేవ్ ది కీలక పాత్ర అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ’83’ అనే పేరుతో బాలీవుడ్ లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కపిల్ దేవ్ జీవితంలో ఎదుర్కొన్న… మనకు తెలియని కొన్ని విషయాల్ని కబీర్ ఈ చిత్రంలో చూపించబోతున్నాడట.
ఇక ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ పోషించబోతున్నాడట. మే నుండీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో కోసం రణవీర్ సింగ్ ప్రత్యేకంగా.. చాలా రోజుల నుండీ క్రికెట్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తూ శిక్షణ పొందుతున్నాడట. ఇక ఈ చిత్రం ద్వారా కపిల్ దేవ్ కూతురు అమియా బాలీవుడ్ లో ఆరంగేట్రం చేయబోతోందని తాజా సమాచారం. అయితే హీరోయిన్ గా మాత్రం కాదు… అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆమె ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. ఈ సందర్భంగా అమియా మాట్లాడుతూ, అసిస్టెంట్ డైరెక్టర్ గా తనకు అవకావం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది.