హైపర్ ఆది(Hyper Aadi) ‘జబర్దస్త్’ ద్వారా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు బుల్లితెర పై అతనో పెద్ద స్టార్. సినిమాల్లో కూడా బిజీగా రాణిస్తున్నాడు. పెద్ద పెద్ద సినిమాల్లో ఆదికి పిలిచి మరీ ఛాన్సులిస్తున్నారు మేకర్స్. అయితే ఆదిపై కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా ఎక్కువగానే చేస్తుంటారు. తాజాగా సీనియర్ నటి ఇంద్రజ.. ఆది పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
ఇంద్రజ మాట్లాడుతూ.. “స్కిట్స్ అన్నాక ఒకరిపై మరొకరు పంచులేయడం కామన్. అయితే పంచులేయడమే కామెడీ కాదు పంచులేస్తే తీసుకోవడం కూడా రావాలి. ఆదికి ఆది రాదు. అందరిపై పంచులేస్తాడు. కానీ ఇంకొకరు అతనిపై పంచులేస్తే తీసుకోలేడు.దానికి ఏదేదో చెబుతాడు. వినడానికి అతను చెప్పే రీజన్స్ చాలా చెత్తగా అనిపిస్తాయి. అలా చెబితే ఈగోకి వెళ్తాడు. ఎప్పుడూ అమ్మాయిల పై పడి ఏడుస్తాడు.
వాళ్లపై కామెడీ, బాడీ షేమింగ్ వంటివి చేస్తాడు. అవి పాత జోకుల్లానే ఉంటాయి. వాస్తవానికి ఆది పై పంచులేసినా ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఎక్కువగానే ఉన్నారు. అది ఆయన గమనించట్లేదు. కానీ ప్రొఫెషనల్ గా ఆది అంటే నాకు గౌరవం ఉంది.వర్క్ విషయంలో చాలా డెడికేటెడ్ గా ఉంటాడు. ఎప్పుడు చూసినా పని తప్ప అతనికి వేరే ధ్యాస ఉండదు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఓ విలేజ్ నుండి వచ్చి ఈ స్థాయికి చేరుకోవడం అంటే చిన్న విషయం కాదు.
ఆది వేరే కమిట్మెంట్స్ వల్ల ఏదైనా ఈవెంట్ ను మిస్ చేసుకునే పరిస్థితిలో ఉంటే.. వేరే వాళ్లకి రిఫర్ చేసి హెల్ప్ చేస్తుంటాడు.సపోర్ట్ చేస్తాడు.ఆది అతనిలో ఉన్న మరో బెస్ట్ క్వాలిటీ” అంటూ ఆదిలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.