Indraja: బన్నీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఇంద్రజ!

గతేడాది డిసెంబర్ లో విడుదలైన ‘పుష్ప’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. నార్త్ లో కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పార్ట్ 2కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘పుష్ప 1’కి, ‘పుష్ప 2’కి నటీనటుల పరంగా పెద్దగా మార్పులు లేవు.

Click Here To Watch Now

పార్ట్ 1లో ఎవరైతే కనిపించారో..? వాళ్లే పార్ట్ 2లో కూడా కనిపించబోతున్నారని దర్శకుడు సుకుమార్ స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ‘పుష్ప 2’లో కొత్త పాత్ర ఎంటర్ కాబోతుందని సమాచారం. ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ ఇంద్రజ.. ఇప్పుడు కొన్ని టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అలానే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం చిత్రబృందం ఇంద్రజను సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఈ పాత్ర చేయడానికి ఇంద్రజ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. చివరి నిమిషంలో స్క్రిప్ట్ లో చేసిన మార్పుల వలన ఒకట్రెండు కొత్త పాత్రలకు అవకాశం దొరికిందని.. అందులో భాగంగా ఇంద్రజను ఖరారు చేశారని తెలుస్తోంది. కథ ప్రకారం.. ఈ రోల్ పుష్పరాజ్ చిన్నప్పటి ఎపిసోడ్ తో లింక్ అవుతుందని తెలుస్తోంది. నిజానికి పార్ట్ 1లో చైల్డ్ ఎపిసోడ్ కొంతవరకే చూపించారు. కానీ పార్ట్ 2లో ఆ ఎపిసోడ్ కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.

నిజానికి ఇప్పటికే ‘పుష్ప 2’ షూటింగ్ ను మొదలుపెట్టాలి కానీ ప్రీప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతుండడంతో షూటింగ్ డిలే అవుతుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus