ఇండస్ట్రీ, ప్రింట్, వెబ్, టెలివిజన్ మీడియా కలిసి ఒకటిగా పని చేయాలి: తెలుగు ఫిలిం ఛాంబర్

సంక్రాంతి సినిమాల విడుదలపై ఇప్పటికి కూడా కొనసాగుతున్న కొన్ని అంశాల గురించి అదేవిధంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు గిల్డ్ నుంచి కొంతమంది ప్రొడ్యూసర్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇండస్ట్రీ గురించి చర్చించిన విషయాలు గురించి మాట్లాడటం జరిగింది. ఈ సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు గారు, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు, తెలుగు ఫిలిం ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు, వై వి ఎస్ చౌదరి గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ కూచిబొట్ల గారు మరియు ఏ కే ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాజేష్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు గారు మాట్లాడుతూ : ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ముఖ్యమైన విషయాలు మీడియా షేర్ చేద్దామని. సంక్రాంతి సినిమాల బరిలో నుంచి ఛాంబర్ కోరగానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి టీ. జీ. విశ్వప్రసాద్ గారు వివేక్ గారు హీరో రవితేజ గారు ముందుకొచ్చి తమ రిలీజ్ డేట్ ని ఫిబ్రవరి 9కి మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు అదే ఫిబ్రవరి 9కి భైరవకోన తమ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ముందు ఈ విషయం ఛాంబర్ నోటీస్ కి రాలేదు వచ్చిన వెంటనే ఏ కాంటైన్మెంట్స్ అనిల్ సుంకర గారితో, రాజేష్ గారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఛాంబర్ వినతిని మన్నించి తమ డేట్ ని ఒక వారం రోజులు అంటే 16 ఫిబ్రవరికి మార్చుకోవడం జరిగింది. సంక్రాంతి అప్పుడు చాంబర్ వినతిని మన్నించి తమ డేట్ ని మార్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి ఇప్పుడు కూడా తమ డేట్ ని మార్చుకొని ఛాంబర్ వినితిని మన్నిస్తున్న ఏ కె ఎంటర్టైన్మెంట్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఫిబ్రవరి 9కి రిలీజ్ అవుతున్న ఈగల్ కి ఎక్కువ శాతం థియేటర్స్ వచ్చేలాగా చూడడం జరుగుతుంది. అదే డేట్ కి యాత్ర 2 వాళ్ళు కూడా రిలీజ్ పెట్టుకున్నారు పొలిటికల్ ఇష్యూస్ మీద డేట్ ముందే ఫిక్స్ చేసుకోవడం వల్ల వాళ్లు డేట్ చేంజ్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అదేవిధంగా ఒక తమిళ్ సినిమా రజనీకాంత్ గారి గెస్ట్రోలు ఆక్ట్ చేసిన లాల్ సలాం కూడా రిలీజ్ అవుతుంది. ఇదే విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో చర్చించినప్పుడు పర్లేదండి మా సినిమాతో రెండు సినిమాలు రావడం పెద్ద ఇబ్బంది కాదు అని చెప్పి వాళ్ళు అనడం చాలా ఆనందం అనిపించింది. ఫిబ్రవరి 9 కి ఈగల్ మేజర్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇక రెండో విషయం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ గిల్డ్ నుంచి కొంతమంది ప్రొడ్యూసర్స్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. దాదాపు 1. 15 నిమిషాలు సీఎం గారితో ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు గురించి చర్చించడం జరిగింది. దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు సమస్యలే కాదు సమస్యల పరిష్కారాలు కూడా మీరే తీసుకురండి ప్రభుత్వాన్ని నుంచి ఏం సహాయం కావాలన్నా చేయడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. ఉన్న సమస్యలన్నిటిమీద ఎల్లుండి ఈ సీ మీటింగ్ పెట్టుకుని దాంట్లో సమస్యలు అన్నిటికి పరిష్కారాలను తీసుకుని మళ్ళీ అతిత్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి దీని గురించి వివరించడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించిన విధానం చాలా పాజిటివ్గా అనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించిన విధానానికి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎల్లుండి ఈ సీ మీటింగ్ లో ఈ విషయాల గురించి అన్నిటిని చర్చించి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్యూచర్ జనరేషన్స్ కి ఒక మంచి బ్రిడ్జి వేయడానికి నిర్ణయించుకున్నాము అన్నారు.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ : సంక్రాంతి టైంలో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మీడియాకి తెలియజేయడం జరిగింది. గాలి వార్తలు కాకుండా ఏదైనా మీ నోటీస్ కి వచ్చినట్టయితే ఇక్కడ మేము అందరం అందుబాటులో ఉంటాం వచ్చి అడిగి తెలుసుకుని మీడియాలో పబ్లిష్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఎవరో చెప్పిన గాలి వార్తలు విని ఇండస్ట్రీలో ఒకరిని నిందించడం ఒకరి గురించి తప్పుగా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. ఇక మీద నుంచి ఏదన్నా ఇంపార్టెంట్ విషయం ఉంటే కచ్చితంగా ఛాంబర్ నుంచి మీటింగ్ పెడతాం లేని పక్షంలో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఏది చెప్పదలుచుకున్నామో దాన్ని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అన్నారు.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ : ఇప్పటిదాకా ఎప్పుడు జరగని పద్ధతిలో సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల ప్రొడ్యూసర్స్ ని పిలిచి మాట్లాడి కన్విన్స్ చేసి ఎవరికీ పోటీ లేకుండా చేయడం. చాంబర్ వినితిని మన్నించి ఈగల లాంటి పెద్ద సినిమా ఫిబ్రవరి 9 కి పోస్ట్ పోన్ అవ్వడం అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఛాంబర్ కొత్తగా ట్రై చేయడం ఇదే మొదటిసారి. దీని గురించి ఎవరో ఒకరిని కార్నర్ చేయడం ఒకరి గురించి తప్పుడు వార్తలు రాయడం అనేది సరైన పద్ధతి కాదు. మళ్లీ ఫిబ్రవరి 9 రిలీజ్ డేట్ గురించి కూడా ఇష్యూ మొదలైంది. మళ్లీ ప్రొడ్యూసర్స్ ని పిలిచి మాట్లాడడం ఛాంబర్ వినితిని మన్నించి అనిల్ సుంకర గారు, రాజేష్ గారు తమ సినిమా డేట్ ని ఒక వారం రోజులు మార్చుకోవడం చాలా మంచి విషయం. ఒక సినిమా డేట్ అనుకున్న తర్వాత మార్చుకోవడం అని తీసి కాదు కానీ ఛాంబర్ వినతిని మన్నించి తమ సినిమాని పోస్ట్ పోన్ చేసుకోవడం అదేవిధంగా నవరత్నాలు సినిమా కూడా ఫిబ్రవరి 9 అనుకొని వాళ్లతో మాట్లాడిన తర్వాత వాళ్లు కూడా ఒప్పుకోవడం ఇండస్ట్రీకి చాలా మంచి విషయం. అదేవిధంగా నిన్న మూడు ఆర్గనైజేషన్స్ కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం. ఆయన ప్రతి సమస్యని విని చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వటం ఇండస్ట్రీ కి ఇంత పాజిటివ్ సపోర్ట్ ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా వన్ ఆర్కే పురం లో ఏషియన్ సినిమాస్ ఓపెనింగ్ కి హనుమాన్ టీం ని సునీల్ గారి పిలవడం జై హనుమాన్ అని చెప్పి మూవీని ప్రమోట్ చేయడం అలాగే దిల్ రాజు గారు ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ అయినా ఆయన ను ముఖ్య అతిథిగా పిలవడం ఇండస్ట్రీకి చాలా మంచి విషయం. కాబట్టి మీడియా ఒకరికి తంపులు పెట్టే విధంగా కాకుండా ఇండస్ట్రీ మీడియా కలిసి ఒకటిగా పని చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. గతంలో చూసుకుంటే కె ఎల్ ఎన్ ప్రసాద్ గారు పెట్టిన ఆంధ్రజ్యోతి పేపర్ గాని పెట్టిన ఆంధ్ర బ్యాంకు గాని ఇండస్ట్రీ పేపర్ ఇండస్ట్రీ బ్యాంకు గా మారాయి. తర్వాత ప్రొడక్షన్ హౌస్ గా డిస్టిబ్యూషన్ హౌస్ గా లక్ష్మీ ఫిలిమ్స్ పెట్టి శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం ఇలాంటి సినిమాలను విడుదల చేశారు. ఇండస్ట్రీ మీడియా ఒకటిగానే ఉంది భవిష్యత్తులో కూడా ఒకటిగానే ఉండాలి ఉంటుంది. ఏమైనా మీడియాకి కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ మేము అందరం అందుబాటులో ఉంటాం. మమ్మల్ని సంప్రదించి నిజాన్ని తెలుసుకుని ప్రజలకి పబ్లిష్ చేయవలసిందిగా కోరుతున్నాము అన్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ కూచిబొట్ల గారు మాట్లాడుతూ : సంక్రాంతి సినిమా టైంలో మూడో ఆర్గనైజేషన్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరు ప్రొడ్యూసర్స్ ని కలిసి సంక్రాంతి సినిమా రేస్ గురించి వివరంగా చెప్పారు. కానీ ఆ విషయం ఒక దిల్ రాజు గారి మీదకి వెళ్లడం ఆయన చెప్పడం వల్ల ఇదంతా జరుగుతుందే అనడం అయితే కరెక్ట్ కాదు. కానీ మళ్ళీ ఫిబ్రవరి 9 గురించి వచ్చిన ఇష్యూలో దిల్ రాజు గారు ఇనిషియేట్ తీసుకోవడం దాంట్లో ప్రసన్నకుమార్ గారు, దాము గారు పాల్గొని అనిల్ సుంకర గారితో, రాజేష్ గారితో మాట్లాడి వాళ్లను ఒక వారం రోజులు వెనక్కి వెళ్ళమని అడగడం. దానికి వాళ్లు కూడా ఒప్పుకోవడం అందరూ కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. ఇది ఫ్రెండ్లీగా అందరూ కలిసి తీసుకునే నిర్ణయం దీని మీద ఎవరో ఒకరిని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయమై దిల్ రాజు గారికి, దాముగారికి, ప్రసన్నకుమార్ గారికి, వై.వి.ఎస్ చౌదరి గారికి, అనుపం రెడ్డి గారికి, సునీల్ నారంగ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాజేష్ గారు మాట్లాడుతూ : ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఈగల్ ఫిబ్రవరి 9కి సోలోడేట్ ప్రామిస్ చేశారు కాబట్టి బైరవకోన ఒక వారం వెనక్కి వెళ్తున్నాం. ఫిబ్రవరి 16 కి రిలీజ్ చేస్తున్నాం. దీనికి సపోర్ట్ చేస్తున్న దిల్ రాజు గారికి, దాముగారికి, ప్రసన్నకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus