Akhanda: ఆ విషయంలో అఖండ మూవీకి అన్యాయం.. ఏం జరిగిందంటే?

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ మూవీ 2021 సంవత్సరం డిసెంబర్ నెలలో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాలో కథ, కథనం కొత్తగా ఉండటంతో పాటు ఈ సినిమాలోని పాత్ర కోసం బాలయ్య ప్రాణం పెట్టేశారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సందేశాలు కూడా ఉన్నాయి. అయితే నేషనల్ అవార్డ్స్ కు సంబంధించి అఖండ మూవీకి అన్యాయం జరిగిందని కొంతమంది చెబుతున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వేర్వేరు కేటగిరీలలో అవార్డుకు అర్హత ఉన్న సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం. అఖండ సినిమా కరోనా సమయంలో కాకుండా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఉంటే సులువుగా 150 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చేవి. అఖండ సినిమాలో ట్విస్టులు కూడా కొత్తగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటన వెలువడగా (Akhanda) ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందో చూడాల్సి ఉంది.

బాలయ్య భవిష్యత్తు సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. బాలయ్య త్వరలో భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాను భారీ రేంజ్ లో నిర్మాతలు తెరకెక్కించగా ఈ సినిమాలో యాక్షన్ సీన్లు స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

ఎఫ్3 సినిమా మరీ బ్లాక్ బస్టర్ కాకపోవడంతో అనిల్ రావిపూడి ఈ సినిమా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు అద్భుతంగా ఉండనున్నాయని సమాచారం. అఖండ సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య ఇతర భాషలపై కూడా దృష్టి పెట్టలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus