సెప్టెంబ‌ర్ 8న ఇంకొక్క‌డు గ్రాండ్ రిలీజ్‌!

శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`. నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం `ఇంకొక్క‌డు`. ఈ చిత్రాన్ని ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ పై ఆ సంస్థ అధినేత నీలం కృష్ణారెడ్డి విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ సంద‌ర్భంగా…

చిత్ర నిర్మాత నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ -“విల‌క్ష‌ణ న‌టన‌ట‌కు విక్ర‌మ్ పెట్టింది పేరు. ఆయ‌న చిత్రాలకు ఇక్క‌డ ఉన్న ఆద‌ర‌ణ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌స‌రం లేదు. ఆయ‌న చిత్రాల్లో ఏదో ఒక కొత్త‌ద‌నం ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు ఆయ‌న సినిమా కోసం ఆస‌క్తి ఎదురుచూస్తుంటారు. తాజాగా అదే కోవ‌లో చియాన్ విక్ర‌మ్ న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇంకొక్క‌డు. అఖిల్‌, ల‌వ్ అనే రెండు పాత్ర‌ల్లో విక్ర‌మ్ అల‌రించ‌డం ఖాయం. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూసిన వారంద‌రికీ విక్ర‌మ్ ల‌వ్ గెట‌ప్ బాగా న‌చ్చింది.

ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది. విక్ర‌మ్ కెరీర్‌లోనే అత్య‌ధిక థియేట‌ర్స్‌లో సినిమా సెప్టెంబ‌ర్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది“ అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus