Naa Saami Ranga: నా సామిరంగ మూవీ టైటిల్ వెనుక అసలు కథ ఇదేనా?

  • January 6, 2024 / 10:49 PM IST

నాగార్జున విజయ్ బిన్నీ కాంబినేషన్ లో తెరకెక్కిన నా సామిరంగ మూవీ ఈ నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. 70 రోజుల్లో షూట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. విడుదలకు ముందే ఈ సినిమా నిర్మాతకు 5 కోట్ల రూపాయల లాభం వచ్చిందని భోగట్టా. ఈ సినిమా కథ విషయంలో నాగ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని తెలుస్తోంది.

నా సామిరంగ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ బిన్నీ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. డైరెక్టర్ కావాలనే సినిమా ఇండస్ట్రీకి వచ్చానని నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ చూసిన తర్వాత డైరెక్టర్ కు అన్ని రంగాలపై గ్రిప్ ఉంటుందని అనిపించిందని విజయ్ బిన్నీ కామెంట్లు చేశారు. డైరెక్టర్ గా తొలి సినిమాను నాగ్ తో చేయడం లక్ గా భావిస్తానని విజయ్ బిన్నీ చెప్పుకొచ్చారు.

నాగార్జునకు ఒక కథ చెప్పగా ఆయన ఈ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేయమని అడిగారని ఈ సినిమాలో వింటేజ్ నాగార్జునను చూస్తారని ఆయన కామెంట్లు చేశారు. నా సామిరంగ ఫ్రెండ్ షిప్ మూవీ అని అల్లరి నరేష్ సినిమాలో అద్భుతంగా చేశారని ఈ సినిమాలోని ముగ్గురు హీరోలకు ఒక్కొక్కరికి ఒక్కో కథ ఉంటుందని విజయ్ బిన్నీ అభిప్రాయపడ్డారు. సినిమాలో చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయని విజయ్ బిన్నీ అన్నారు.

ఈ మూవీ 1980 నుంచి 1990 మధ్య కాలంలో జరిగే కథ అని ఆయన చెప్పుకొచ్చారు. నా సామిరంగ ఏఎన్నార్ సినిమాలో ప్రజాదరణ పొందిన సాంగ్ అని ఈ సినిమాకు ఆ టైటిల్ బాగుంటుందని భావించి అందరం కలిసి టైటిల్ ఫిక్స్ చేశామని విజయ్ బిన్నీ కామెంట్లు చేశారు. విజయ్ బిన్నీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నా సామిరంగ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అక్కినేని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus