Bommarillu Bhaskar: నాన్నను షాకయ్యేలా చేసిన బొమ్మరిల్లు భాస్కర్!

బొమ్మరిల్లు సినిమా ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఏ మాత్రం తడబడకుండా యువతకు నచ్చేలా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాను తెరకెక్కించడంతో అఖిల్ ఖాతాలో తొలి బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. అయితే ఈ డైరెక్టర్ సినిమాలలో ఏ విధంగా ట్విస్టులు ఉంటాయో ఈ డైరెక్టర్ రియల్ లైఫ్ లో కూడ అదే విధమైన ట్విస్టులు ఉండటం గమనార్హం.

తమిళుడైన భాస్కర్ పరుగు సినిమా చెయ్యడానికి సిద్ధమైన సమయంలో అతనికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అయితే అప్పటికే ఒకమ్మాయిని ప్రేమిస్తున్న భాస్కర్ నాన్నకు తన ప్రేమ గురించి చెప్పాలని అనుకున్నారు. ఆ సమయంలో భాస్కర్ నాన్న పది రోజుల్లో పెళ్లి చేసుకోకపోతే వివాహం ఆలస్యమవుతుందని చెప్పగా భాస్కర్ తొందరేముంది అంటూ బదులిచ్చారు. అయితే భాస్కర్ తండ్రి మాత్రం ఒకమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ చేసి వారం రోజుల్లో పెళ్లి అని చెప్పారు.

ఆ తర్వాత భాస్కర్ ప్రేమించిన అమ్మాయితో అరసవెళ్లి ప్రాంతానికి వెళ్లి తానొక అమ్మాయిని లవ్ చేశానని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని అరసవెళ్లికి రావాలని కుటుంబ సభ్యులను కోరాడు. భాస్కర్ చెప్పిన ఆ మాట విని ఫ్యామిలీ మెంబర్స్ షాకయ్యారు. గౌరి శ్రీవిద్య అనే యువతిని భాస్కర్ పెళ్లి చేసుకున్నారు. గౌరి శ్రీవిద్య, భాస్కర్ లకు పుట్టిన కూతురి పేరు హాసిని కావడం గమనార్హం.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus