ప్రస్తుతం సినీ ప్రేక్షకుల మధ్య కాంతార మూవీ గురించి జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి, సప్తమి గౌడ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించడంతో పాటు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారనే సంగతి తెలిసిందే. కాంతార సినిమా సక్సెస్ సాధించడంతో రిషబ్ శెట్టితో పాటు హీరోయిన్ సప్తమి గౌడ గురించి జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం. సప్తమి గౌడకు ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తుండగా నిజంగా ఆఫర్లు వస్తే ఆ ఆఫర్ల విషయంలో ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
కాంతార సినిమా సక్సెస్ తో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకున్న సప్తమి గౌడ ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ కాంతార మూవీ కోసం నన్ను సంప్రదించిన సమయంలో ఈ సినిమా కథ, పాత్రలకు సంబంధించి నాకు ఏ విషయం తెలియదని అన్నారు. కానీ నాపై నమ్మకం ఉండటంతో రిషబ్ శెట్టి ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారని సప్తమి గౌడ తెలిపారు. రిషబ్ శెట్టికి ధన్యవాదాలు చెబుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
ఇతర భాషలలో సినిమా ఆఫర్లు వస్తే ఏ మాత్రం సంకోచించకుండా నేను నటిస్తానని ఆమె కామెంట్లు చేశారు. వాటికి ఎలాంటి హద్దులు పెట్టుకోలేదని ఆమె అన్నారు. సప్తమి గౌడ 1996 సంవత్సరం జూన్ నెల 8వ తేదీన బెంగళూరులో జన్మించారు. సప్తమి గౌడ తండ్రి ఉమేష్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పని చేశారు. సప్తమి గౌడ బెంగళూరులోని ప్రముఖ కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ చదివారు.
పాప్ కార్న్ మంకీ టైగర్ సప్తమి గౌడ తొలి సినిమా కాగా కాంతార రెండో సినిమా కావడం గమనార్హం. ఈమె నేషనల్ లెవెల్ స్విమ్మర్ కాగా డ్యాన్సింగ్, బుక్ రీడింగ్, ట్రావెలింగ్ ఈమె హాబీస్ కావడం గమనార్హం. ఫిట్ నెస్ కు సప్తమి గౌడ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!