ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో కాంతార సినిమా గురించి జోరుగా చర్చ జరుగుతుండగా కాంతార సినిమా భారతీయ సినిమా స్థాయిని మరింత పెంచిందని చెప్పవచ్చు. ఆకట్టుకునే కథాకథనాలతో విమర్శలకు తావివ్వకుండా మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం. పోకిరి సినిమా క్లైమాక్స్ ను చూసిన సమయంలో ఆడియన్స్ ఏ విధంగా ఫీలయ్యారో ఇప్పుడు కాంతార విషయంలో కూడా అదే విధంగా ఫీలయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటే ప్రేక్షకులు పూర్తిస్థాయిలో సంతృప్తితో థియేటర్ నుంచి బయటకు వస్తారని కాంతార మూవీ ప్రూవ్ చేసింది.
ఈ సినిమాలో బోరింగ్ సన్నివేశాలు లేవా అనే ప్రశ్నకు ఉన్నాయనే సమాధానం వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్లు ఈ సినిమాలోని మైనస్ పాయింట్లను డామినేట్ చేశాయి. రిషబ్ శెట్టి ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు ఈ సినిమాకు దర్శకునిగా వ్యవహరించారనే విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రాజ్.బి.శెట్టి ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. రిషబ్ క్లైమాక్స్ విషయంలో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని భావించి రాజ్.బి.శెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు.
రిషబ్ కు రాజ్ మంచి స్నేహితుడు కావడంతో కొన్ని సన్నివేశాలకు రాజ్ దర్శకత్వం వహించడం గమనార్హం. మరోవైపు హోంబులే బ్యానర్ నిర్మాతలు చాలా లక్కీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. హొంబులే బ్యానర్ నిర్మాతలు తెరకెక్కించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు భారీ మొత్తంలో లాభాలను సొంతం చేసుకోవడం గమనార్హం.
కాంతార తరహా సినిమాలు మరిన్ని తెరకెక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలీవుడ్ సినిమాలు వరుసగా నిరాశ పరుస్తుండగా సౌత్ సినిమాలు మాత్రం అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. కాంతార హిందీ వెర్షన్ కు బుకింగ్స్ బాగున్నాయి. కాంతార సక్సెస్ తో కన్నడ ఇండస్ట్రీ మేకర్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!