పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్

పవన్ కళ్యాణ్, ఆ పేరులోనే ఓ పవర్ ఉంది, అందుకే పవర్ స్టార్ అయ్యారు. ఆయన కళ్లల్లో ప్రేమికుడు.. మాటల్లో నాయకుడు.. చేతల్లో శ్రామికుడు కనిపిస్తారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి అడుగు పెట్టినా.. తనకంటూ ఓ పేరు, అభిమానులను సంపాదించుకున్నారు. నేటి యువతకు ఐకాన్ గా మారిన పవర్ స్టార్ రీల్ & రియల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు….

1. కొణిదెల కళ్యాణ్ బాబుకొణిదెల వెంకట రావు, అంజలీ దేవికి ఆఖరి సంతానం పవన్. సెప్టెంబర్ 2, 1971 న జన్మించారు.
పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. హనుమాన్ మీద ఉన్న భక్తితో పవన్ కళ్యాణ్ అనే స్క్రీన్ నేమ్ పెట్టుకున్నారు.

2. బ్లాక్ బెల్ట్పవన్ కి చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం. అందుకే కరాటే నేర్చుకున్నారు. అందులో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. హీరోగా మారిన తర్వాత కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఆపలేదు.

3. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీహీరోగా చేయడం ఇష్టం లేకపోయినా, తన వదిన సురేఖ ప్రోద్భలంతో 1996 లో “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” చిత్రం తో వెండి తెర ప్రవేశం చేశారు. తొలి ప్రేమ ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తమ్ముడు, బద్రి, ఖుషి హ్యాట్రిక్ హిట్ అందుకుని పవర్ స్టార్ అయ్యారు. జల్సా, గబ్బర్ సింగ్ సినిమాలు పవన్ సత్తాను చాటాయి. అత్తారింటికి దారేది రికార్డులను తిరగ రాసింది.

4. రియల్ హీరోతన సినిమా వల్ల నష్ట పోయిన వారికి పవన్ అనేక సందర్భాల్లో అండగా ఉన్నారు. “జానీ” వల్ల లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టపోయిన అమౌంట్ ఇచ్చారు. “కొమురం పులి” చిత్రం విషయంలో ను ఇలాగే జరిగింది. తన రెమ్యునరేషన్ నుంచి రెండుకోట్లు నిర్మాతకు తిరిగి ఇచ్చి రియల్ హీరో అనిపించుకున్నారు. అలాగే వైజాక్ హుద్ హుద్ బాధితులకు 50 లక్షలు, చెన్నై వరద బాధితులకు రెండు కోట్లు సాయం చేశారు.

5. రైతుపవన్ కి వ్యసాయం చేయడమంటే చాలా ఇష్టం. అందుకే ఖాళీ దొరికితే హైదరాబాద్ శివార్లలోని తన ఫామ్ హౌస్ లో కాయగూరలు, పండ్ల మొక్కలు పెంచుతుంటారు.

6. మల్టీ ట్యాలెంటెడ్సినిమా రంగం లోని అనేక క్రాఫ్ట్ లపై పవన్ కి పట్టు ఉంది. స్క్రీన్ ప్లే రైటర్, డైరక్టర్, స్టంట్ మాస్టర్ , సింగర్ మరియు కొరియోగ్రాఫర్ గా మెప్పించారు.

7. పెప్సీ మెచ్చిన హీరో

ప్రముఖ పానీయాల సంస్థ పెప్సీ బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కొంతకాలం కొనసాగారు. ఆ కంపెనీ ప్రకటనకు తీసుకున్న తొలి సౌత్ ఇండియన్ యాక్టర్ గా పవర్ స్టార్ నిలిచారు.

8. పవనిజంప్రస్తుతం తెలుగు యువతకు పవనిజం కొత్త మతమయ్యింది. సమాజం కోసం, దేశం కోసం పాటు పడే పవన్ అభిమానులు కలిసి ఈ గ్రూప్ ని విస్తృతం చేస్తున్నారు. ఈ పేరుతో గ్రామాల్లో సైతం యువకులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

9. అత్యధిక ఫాలోవర్స్స్టార్ ఇండియా వాళ్లు నిర్వహించిన దేశంలో ఎక్కువమంది ఫాలోయింగ్ ఉన్న నటులు ఎవరు అనే సర్వేలో పవన్ కళ్యాణ్ ఐదవ స్థానంలో నిలిచారు. నేటి తెలుగు నటుల్లో మొదటి స్థానంలో నిలిచి యువతలో క్రేజీ హీరో గా నిరూపించుకున్నారు.

10. జనసేనరాజకీయ నేతగా ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలు చేయవచ్చని భావించి పవన్ కళ్యాణ్ మార్చి 14, 2014 న జనసేన పార్టీ స్థాపించారు. ఈ పార్టీ కోసం పనిచేయడానికి రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలతో పాటు, సెలిబ్రిటీలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus