Eega: రాజమౌళి చేసిన చిన్న సినిమా… భారీ సినిమా అయింది.. ఎందుకో తెలుసా?

  • August 18, 2024 / 05:17 PM IST

రాజమౌళి  (S. S. Rajamouli) స్టార్‌ డైరక్టర్‌గా మారిన తర్వాత చేసిన సినిమాలు లిస్ట్‌ రాస్తే.. అందులో చిన్న సినిమా ఏమైనా ఉందా అని చూస్తే ‘మర్యాద రామన్న’  (Maryada Ramanna) సినిమా ఒకటే కనిపిస్తుంది. అయితే ఆ సినిమాతోపాటు‘ఈగ’ (Eega) సినిమా కూడా ఉండాలి. రాజమౌళి అనుకున్నట్లుగా ఆ రోజుల్లో జరిగి ఉంటే.. ‘ఈగ’ కూడా చిన్న సినిమానే. అయతే లీకులే ఆ సినిమాను ఈ స్థాయికి తీసుకొచ్చాయట. రాజమౌళి సినిమా.. అందరి దర్శకుల సినిమాలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్, షూటింగ్, పబ్లిసిటీ అనే ఫ్లోలోనే సాగుతుంది.

Eega

అయితే డిఫరెన్స్‌ ఏంటంటే.. తన సినిమా కథలో మెయిన్‌ పాయింట్‌ను షూటింగ్‌ మొదలైన తొలి రోజుల్లోనే ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ చెప్పేస్తారు. అలా ఆయన చాలా సినిమాల నుండి చేస్తూనే ఉన్నారు. అయితే, అలా ఏదీ, ఎవరికీ చెప్పకుండా సినిమా చేసేద్దాం అనుకున్నారు. ఆ సినిమానే ‘ఈగ’. ‘ఈగ’ సినిమాను ‘మర్యాదరామన్న’ సినిమా కంటే చిన్న చిత్రంగా, తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించాలని రాజమౌళి అనుకున్నారు. ఇన్ని హిట్స్ కొట్టాం కదా.. తక్కువ బడ్జెట్‌లో ప్రయోగం చేద్దాం..

డబ్బులు పోతే పోనీ అనుకుని ఆ సినిమా పనులు మొదలుపెట్టారట. మీడియాకి, జనాలకు చెప్పకుండా.. తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్‌ చేశారట. కానీ మీడియాలో ‘ఈగ’ సినిమా గురించి విషయాలు ఒక్కొక్కటీ లీక్‌ అవుతూ వచ్చాయి. రాజమౌళి యానిమేషన్ సినిమా చేస్తున్నారని, ఇందులో హీరోహీరోయిన్లు ఉండరు అంటూ ఏవేవో పుకార్లు బయటకు వచ్చాయి. దీంతో ఇదేదో ఇబ్బంది పెట్టేలా ఉంది అని అనుకుని..

అసలు విషయంలో ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ అనౌన్స్‌ చేశారు. కథ ప్రధానాంశం కూడా చెప్పారు. ఓ చిన్న సినిమాగా రిలీజ్ చేద్దాం అనుకుంటే అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోయింది. దీంతో ‘ఈగ’ భారీ చిత్రంగా వచ్చింది. వసూళ్లు కూడా అదే స్థాయిలో వచ్చాయి.

పవన్‌ హామీ ఇచ్చాడు.. ఇప్పుడు చరణ్‌ చేస్తున్నాడు.. ఆ మంచి పని ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus