ఇప్పటి సినిమాలు చూస్తుంటే.. ఈ సీన్ ఎక్కడో చూసినట్లుంది అని గత తరం సినిమా జనాలు అనుకుంటూ ఉంటారు. అయితే ఠక్కున ఆ పాత సినిమా ఏంటో గుర్తుకు రాదు. ఇక రాజమౌళి సినిమాలు అయితే ఇలాంటి ఆలోచనలు చాలానే ఉంటాయి. రాజమౌళి సినిమాల కథారచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ విషయంలో గతంలో కొన్నిసార్లు చెప్పారు కూడా. ఇదంతా ఇప్పడు ఎందుకు అనుకుంటున్నారా? ఇటీవల వారి నుండి వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఓ సీన్ విషయంలో ఎప్పుడో 50 ఏళ్ల క్రితం నాటి సినిమాను గుర్తు చేస్తుండటమే.
పాత సినిమాలను చూసి సన్నివేశాలు అల్లుకోవడం, కథలు తీర్చిదిద్దుకోవడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సినిమాల విషయంలో చూశాం. ముందుగా చెప్పినట్లు రాజమౌళి, విజయేంద్రప్రసాద్ కూడా ఇలానే చేస్తుంటారు. సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’కు చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ స్ఫూర్తిగా నిలిచింది. ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సినిమాకి ‘వసంత కోకిల’ ఇన్‌స్పిరేషన్ అనే విషయం తెలిసిందే. ఇక ‘బాహుబలి 2’లోని ఇంటర్వెల్ సీన్‌కు పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చేసే హంగామానే ఇన్‌స్పిరేషన్. ఇవన్నీ విజయేంద్ర ప్రసాద్ చెప్పిన విషయాలే.
‘ఆర్ఆర్ఆర్’లోనూ ఇంటర్వెల్ సీన్ అలా ఓ పాత సినిమా స్ఫూర్తితో తీశారని లేటెస్ట్ చర్చ. ఈ కథకు కూడా కొంత మేర ఆ సినిమా ఆధారంగా నిలిచింది అని అంటున్నారు కూడ. కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా 53 ఏళ్ల క్రితం ‘మంచి మిత్రులు’ అనే సినిమా వచ్చింది. 1969లో విడుదలైన ఈ సినిమాలో కృష్ణ దొంగ పాత్రలో కనిపిస్తే, శోభన్ బాబు పోలీస్‌గా చేశారు. ఈ ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియదు. చివరికి ఓ సన్నివేశంలో అసలు విషయం తెలుస్తుంద.
నిన్ను పట్టుకోవడానికి మారు వేషంలో తిరుగుతున్న పోలీసుని నేను అంటూ కృష్ణకు శోభన్ బాబు షాకిస్తాడు. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ – అక్తర్ సీన్స్ కూడా ఇలానే నడుస్తాయి. ఇద్దరి ఫేస్ ఆఫ్ కూడా ‘మంచి మిత్రులు’ తరహాలోనే ఉంటుంది. సినిమా ఇంటర్వెల్ సీన్లో తాను పోలీసునని రివీల్ చేసి.. తారక్‌ను అరెస్ట్ చేయడానికి చరణ్ ప్రయత్నిస్తాడు. ఈ రెండు సీన్లను పోలుస్తూ, సినిమాలను కంపేర్ చేస్తూ ‘మంచి మిత్రులు’ని సీన్‌ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!