మలయాళంలో భారీ విజయాలు అందుకున్న సినిమాలు తెలుగులోకి రావడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. అలా కొన్ని మలయాళ సినిమాలను సితార ఎంటర్‌టైన్మెంట్స్ కొనుగోలు చేసింది. అందులో ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ ఒకటి అయితే, మరొకటి ‘కప్పెలా’. రెండో సినిమా రీమేక్ పనుల్ని ఇటీవల ప్రారంభించారు కూడా. అదే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న సినిమా. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. ‘కప్పెలా’లో ఎక్కువ పాత్రలు ఉండవు. అలాగే పరిమిత ప్రాంతాల్లో చిత్రీకరించిన విషయం తెలిసిందే.
ఒరిజినల్ సినిమాలో రోషన్ మాథ్యూ చేసిన పాత్రను తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ చేస్తున్నాడు. శ్రీకాంత్ భాసి చేసిన పాత్రకు తమిళ నటుడు అర్జున్ దాస్‌ను ఎంచుకున్నారట. ఇక మిగిలిన కీలక పాత్ర కథానాయిక. మలయాళంలో అనా బెన్ చేసిన ఈ పాత్రను అనైకను తీసుకుంటారట. ఈ భామ కొత్తేం కాదు. ‘విశ్వాసం’, ‘ఎంతవాడు గానీ’ సినిమాలో బాల నటిగా కనిపించింది ఆమెనే. ఇక ఈ సినిమా గురించి చర్చలో మరో అంశం… చాలావరకు ఓకే అయిన అంశం టైటిల్.
ఈ సినిమాకు ‘బుట్టబొమ్మ’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ టైటిల్‌ను సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ కూడా చేయించిందని వినికిడి. ఏదైనా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తారేమో… అందుకే ఈ పేరు రిజిస్టర్ చేయించారేమో అని అందరూ అనుకున్నారు. అయితే అది ‘కప్పెలా’ రీమేక్‌కి అని తెలిసి… అందరూ వావ్ అంటున్నారు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!