Bhuma Mounika Reddy: పుట్టబోయే బిడ్డ గురించి ముందుగానే హింట్ ఇచ్చిన మనోజ్!

మంచు మనోజ్ ఇటీవల తాను తండ్రి కాబోతున్నాను అని విషయాన్ని అభిమానులకు తెలియజేసిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ ఈ ఏడాది భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. అయితే ఇదివరకే భూమా మౌనిక రెడ్డికి ఒక కొడుకు ఉన్న సంగతి మనకు తెలిసిందే. మౌనికను పెళ్లి చేసుకున్న తర్వాత మనోజ్ మౌనిక కుమారుడు ధైరవ్ బాధ్యతను కూడా తీసుకున్నారు.

పెళ్లి తర్వాత కెరియర్ పరంగా ఎంతో బిజీ అయినటువంటి మనోజ్ గత కొద్ది రోజుల క్రితం తాను తండ్రి కాబోతున్నాననే గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. అత్తమ్మ శోభ నాగిరెడ్డి మామయ్య నాగిరెడ్డి మీరు మరోసారి అమ్మమ్మ తాతయ్యలు కాబోతున్నారని ధైరవ్ అన్నయ్య కాబోతున్నారని తెలియజేశారు.

ఇకపోతే తన తల్లిదండ్రుల ఆశీస్సులతో తమ కుటుంబం పెద్దదవుతుందని వారి ఆశీస్సులు ఎల్లవేళలా మాపై ఉండాలి అంటూ ఈయన మౌనిక ప్రెగ్నెన్సీ గురించి తెలియజేశారు. అయితే తాజాగా మౌనిక ప్రెగ్నెన్సీ గురించి మనోజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్స్ మౌనిక ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేస్తూ తమకు కూతురు పుడుతుందనే విషయాన్ని మనోజ్ పరోక్షంగా హింట్ ఇచ్చారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మౌనిక (Bhuma Mounika Reddy) ప్రెగ్నెంట్ అనే విషయాన్ని మనోజ్ శోభ నాగిరెడ్డి జయంతి వేడుకల సందర్భంగా తెలియజేశారు. అత్తమ్మ శోభ నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఈ విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది అంటూ తెలిపారు. దీన్ని బట్టి చూస్తుంటే కచ్చితంగా కూతురు పుడుతుందని అందుకే తన అత్తమ్మ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని తెలియ చేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి అందరూ భావిస్తున్నట్లు ఈయనకు కూతురు పడుతుందా లేదా కొడుకు పుడతారా అనేది తెలియాల్సి ఉంది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus