Dhanush, Aishwarya: ధనుష్ కంటే ముందుగా ఐశ్వర్య ఆ హీరో ప్రేమలో పడిందా?

  • September 19, 2023 / 07:26 PM IST

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు ధనుష్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ హాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ధనుష్ తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉండేవారు. ఈయన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు అయితే వీరి వివాహం జరిగిన తర్వాత 18 సంవత్సరాలకు వీరి మధ్య వచ్చిన మనస్పర్ధలు భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా ఈ జంట ఇన్ని సంవత్సరాలకు విడాకులు తీసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఐశ్వర్య ధనుష్ విడిపోవడంతో వీరిద్దరూ కూడా తమ సినీ కెరియర్ పై ఫోకస్ పెట్టి పలు సినిమాల ద్వారా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఐశ్వర్య ధనుష్ వివాహం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధనుష్ ని ప్రేమించక ముందే ఐశ్వర్య మరొక స్టార్ హీరోని ప్రేమించారట. అయితే వీరిద్దరి లవ్ బ్రేకప్ కావడంతో ఆయనపై కోపంతోనే ధనుష్ ని పెళ్లి చేసుకున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ధనుష్ కంటే ముందుగా ఐశ్వర్య హీరో శింబుతో ప్రేమలో పడ్డారట. వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో వీరి లవ్ బ్రేకప్ చెప్పుకున్నారు

అయితే అదే సమయంలోనే హీరో శింబుతో పోటీగా ఇండస్ట్రీలో ధనుష్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండేవారు దీంతో ఆయనపై కోపంతో ఈమె ధనుష్ తో ప్రేమలో పడటం ఆయనను పెళ్లి చేసుకోవడం జరిగింది అంటూ ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి ధనుష్ నుంచి కూడా (Aishwarya) ఐశ్వర్య విడిపోయి తన పిల్లలతో ఒంటరిగా ఉన్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus