చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో తెలుగుదేశం అభిమానులు అలాగే పలువురు తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు మద్దతు తెలుపకపోవడంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు వర్సెస్ తెలుగుదేశం కార్యకర్తలు అన్ని విధంగా వార్ నడుస్తుంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక అభిమాని స్వయంగా ఎన్టీఆర్కు ఫోన్ చేసి మరి ఎన్టీఆర్ సినిమాల విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.
ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే … చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ తన మద్దతు తెలియజేయకపోవడంతో ఎన్టీఆర్ నటించిన సినిమాలను ఏపీలో ఆడనివ్వము అంటూ వార్నింగ్ ఇచ్చారట. ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ సినిమాలను ఏపీలో అసలు ఆడనివ్వము అంటూ ఎన్టీఆర్ అభిమానులకు వార్నింగ్ ఇస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తమదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది. నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్టీఆర్ సినిమా ఒక్క షో ఆపి చూడండి అంటూ సవాల్ విసిరారట. ఇలా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో సోషల్ మీడియాలో మాత్రం అభిమానుల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తోంది.
ఇక ఎన్టీఆర్ (Jr NTR) గురించి ఎన్నో రకాల విమర్శలు వచ్చినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. ఇలా చంద్రబాబు విషయంలో ఎన్టీఆర్ మౌనంగా ఉండడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు