చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశీ.. అటు తరువాత హీరోయిన్ గా కూడా మారిన సంగతి తెలిసిందే. మంచి కదా బలమున్న సినిమాలను ఎంపికచేసుకుంటూ.. అవసరమైన సన్నివేశాల్లో తన గ్లామర్ ను వలకపోస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రాశీ. ‘శుభాకాంక్షలు’ ‘పెళ్లి పందిరి’ ‘గోకులంలో సీత’ ‘స్నేహితులు’ ‘ప్రేయసి రావే’ ‘మానసిచ్చి చూడు’ వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. కెరీర్ కాస్త డల్ అయ్యింది అనుకున్న టైములో వెంటనే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
తెలుగుతో పాటు తమిళ్, మలయాళం కలిపి మొత్తం 80కి పైనే సినిమాల్లో నటించిన రాశీ.. అంత సడెన్ గా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమవ్వడమేంటి అని అంతా చర్చించుకున్నారు. అసలు రాశీ భర్త ఎవరు..? ఆమెది పెద్దలు కుదిర్చిన పెళ్లా లేక ప్రేమ పెళ్లా? ఇలాంటి డౌట్స్ ప్రేక్షకుల్లో చాలానే ఉండేవి. అయితే రాశీది ప్రేమ వివాహమనే తెలుస్తుంది. రాశీ భర్త పేరు శ్రీముని. ఈయన చాలా సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసాడు.
రాశీ నటించిన పలు సినిమాలకు కూడా సహాయ దర్శకుడిగా పనిచేసాడు. అలా వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందట. రాశీ తండ్రి చనిపోయిన సమయంలో కూడా శ్రీముని.. రాశీకి అండగా నిలిచాడట. అటు తరువాత వీరిద్దరూ వివాహం చేసుకోవడం జరిగిందని తెలుస్తుంది.కోట్ల ఆస్తి కలిగిన వారిని కూడా కాదని రాశీ.. శ్రీమునిని వివాహం చేసుకుందట. ప్రస్తుతం రాశీ తన భర్త పిల్లలతో కలిసి హైదరాబాద్ లోనే ఉంటూ వస్తోంది.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?