అవును.. మీరు చదువుతున్నది నిజమే..! మెగాస్టార్ చిరంజీవి సినిమాని కూడా సైడేసేసి ఆర్.నారాయణ మూర్తి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇంకో విచిత్రం ఏంటంటే.. ఈ రెండు చిత్రాల టైటిల్స్ లో ‘రిక్షా’ అనే పదం కామన్ గా ఉండడం. 1995 వ సంవత్సరంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. దర్శకరత్న దాసరి నారాయణ గారు ఆర్.నారాయణ మూర్తిని హీరోగా పెట్టి.. ‘ఒరేయ్ రిక్షా’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అంతకు ముందు ఆర్.నారాయణ మూర్తి..
దాసరి గారి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఇక ‘ఒరేయ్ రిక్షా’ లో ఆర్.నారాయణ మూర్తి సరసన రవళి హీరోయిన్ గా నటించింది. వందేమాతరం శ్రీనివాస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఆడియో సూపర్ హిట్ అయ్యింది. సినిమా పై అంచనాలను పెంచింది. అయితే పోటీగా మెగాస్టార్ చిరంజీవి- కోడిరామ కృష్ణ కాంబినేషన్లో ‘రిక్షావోడు’ అనే చిత్రం కూడా అదే టైంకి విడుదలయ్యింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలబడ్డాయి.
నిజానికి మెగాస్టార్ ఇమేజ్ కు, ఆర్.నారాయణ మూర్తి ఇమేజ్ కు సంబంధం లేదు. చిరు అప్పట్లో నెంబర్ 1 హీరోగా దూసుకుపోతున్న రోజలవి. అయితే అనూహ్యంగా ‘రిక్షావోడు’ ప్లాప్ అవ్వడం ‘ఒరేయ్ రిక్షా’ సూపర్ హిట్ అవ్వడం జరిగింది.ఇదిలా ఉండగా.. అంతకు చిరంజీవి హీరోగా నటించిన ‘కోతల రాయుడు’ ‘ప్రాణం ఖరీదు’ వంటి సినిమాల్లో ఆర్.నారాయణ మూర్తి కూడా నటించారు. చిరంజీవికి ఉన్న అత్యంత సన్నిహితులలో ఆర్.నారాయణ మూర్తి కూడా ఒకరు కావడం విశేషం.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!