రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ ఒకటి. గత మూడేళ్ళుగా ఊరిస్తున్న ఈ సినిమా బిగ్ స్క్రిన్ పైకి రావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. సినిమా షూటింగ్ ఎండింగ్ కు వచ్చినప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం పెద్దగా అప్డేట్స్ ఇవ్వడం లేదు. ఓపిక పట్టండి అంటూ వాగ్దానాలు బాగానే ఇస్తున్నారు గాని అభిమానులు ఆశలు పెట్టుకున్న ప్రతిసారి పెద్ద ఝలక్ ఇస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి.
ఇక సినిమాకు సంబంధించిన టీజర్ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీజర్ ఎలా ఉంటుందనే విషయంలో రోజుకో రూమర్ వైరల్ గా మారింది. ఇక టీజర్ లో వీలైనంత వరకు ప్రభాస్ కు సంబంధించిన రెండు విభిన్నమైన హావభావాలను చూపిస్తారట. సంక్రాంతి కానుకగా టీజర్ ను ఈ నెల 14న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా టీజర్ నిడివి 30 సెకన్లు ఉంటుందని సమాచారం. సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను నెవర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. డార్లింగ్ సినిమా అనంతరం ప్రభాస్ లవ్ స్టోరీలను పెద్దగా టచ్ చేయలేదు. ఇక చాలా కాలం తరువాత అంతకంటే ఎక్కువ స్థాయిలో ఫీల్ గుడ్ సినిమాగా రాధేశ్యామ్ ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుందని అంటున్నారు. మరి బాహుబలి, సాహో లాంటి యాక్షన్ సినిమాల అనంతరం ఈ ప్రేమకథకు అభిమానులు ఎంతవరకు కనెక్ట్ అవుతారో చూడాలి.