Baipan Bhari Deva: ఆ రూ.90 కోట్ల ‘ఓల్డ్‌’ బ్లాక్‌ బస్టర్‌ తెలుగులోకి వస్తోందా

రూ. 5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా రూ. 90 కోట్లు వసూలు చేసింది అంటే నమ్ముతారా? నిజానికి ఇలాంటి విషయాలు ఒకప్పుడు చెబితే నమ్మేవారు కాదు కానీ… ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలు, వాటి లెక్కలు చూస్తే కచ్చితంగా నమ్ముతారు. అయితే ఆ సినిమా మంచి స్వింగ్‌లో ఉన్న సౌత్‌ సినిమా పరిశ్రమల నుండి రాలేదు, అలాగే ఇప్పుడిప్పుడే తిరిగి పట్టాలెక్కున్న బాలీవుడ్‌ నుండి కూడా రాలేదు. హిందీ సినిమా నీడలో ఇన్నాళ్లూ ఉండిపోయిన మరాఠీ నుండి వచ్చింది.

మరాఠీ సినిమాలు ఇటీవల కాలంలో మంచి విజయాలు అందుకుంటున్నాయి. బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న నటులు కూడా మరాఠీలో సినిమాలు చేసి విజయం సాధిస్తున్నారు. అంతేకాదు ఆ ఇండస్ట్రీకి బూస్టింగ్‌ ఇస్తున్నారు. అలాంటి పరిశ్రమ నుండి ఓ సినిమా వచ్చింది. నిజానికి ఓ సునామీ వచ్చింది అనే చెప్పాలి. ఇందాక చెప్పాం కదా రూ. 90 కోట్ల వసూళ్లు అని ఆ సినిమానే ఇది. ఇందులో స్టార్ హీరో లేడు, ఆ మాటకొస్తే ఓ మోస్తరు హీరో కూడా లేడు. అంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లే. కానీ భారీ విజయం అందుకున్నారు.

ఇన్ని విషయాలు చెప్పి… అసలు ఆ ఘనత సాధించిన సినిమా ఏంటో చెప్పకపోవడం తప్పు కదా. గతేడాది థియేటర్లలో విడుదలై, ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతున్న ‘బైపన్‌ భారీ దేవా’. ఈ సినిమాలో ప్రధానపాత్ర పోషించినామె మనకు బాగా తెలిసినావిడే. అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం అక్కినేని ‘సీతారామయ్య గారి మనవరాలు’ సినిమాలో నాన్నమ్మ పాత్ర పోషించినామెనే. మరీ అంత గుర్తు లేదు అంటే ‘లిటిల్‌ సోల్జర్స్‌’లో పిల్లలు బామ్మ పాత్ర. ఇంకా లేటెస్ట్ చెప్పాలంటే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో బామ్మ పాత్రధారి.

కేదార్‌ షిండే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో (Baipan Bhari Deva) ఆరుగురు నడి వయసు దాటిన మహిళలు ఉంటారు. దైనందిన జీవిత సమస్యలు, కుటుంబ కష్టాల నడుమ సాగుతున్న ఓ ఆరుగు అక్కచెల్లెళ్లకు డ్యాన్స్‌ షోలో పాల్గొనాలని ఉంటుంది. అసలు ఎందుకు పాల్గొనాలని అనుకున్నారు. దాని కోసం ఏం చేశారు? ఆ తర్వాత ఏం జరిగింది అనేదే సినిమా కథ. అయితే ఈ సినిమాకు మనకు ఎందుకు రిలేటెడ్‌ అనుకుంటున్నారా? ఈ సినిమాను తెలుగులోకి రీమేక్‌ చేద్దాం అనుకుంటున్నారట. త్వరలోనే వివరాలు వెల్లడిస్తారట.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus