బిగ్‌బాస్ ఇంట్లో త్యాగాలు చేయాల్సిన టైమ్ వచ్చేసింది. ప్రతి సీజన్ సీరియస్ మలుపు తిరిగేసరికి బిగ్‌బాస్ ఈ తరహా టాస్క్‌లు తీసుకొస్తుంటాడు. నామినేషన్ టైమ్‌లోనే ఇలాంటివి ఇస్తుంటాడు అనుకోండి. నాలుగో సీజన్లో ఆ టైమ్ వచ్చేసింది. ఇంట్లో ఒకరంటే ఒకరికి ఎంత అభిమానం ఉంది, నామినేషన్ విషయంలో త్యాగం చేస్తారా లేదా అనేది తేలిపోయే సమయం వచ్చింది. ఇద్దరిద్దరిని పక్కన నిలబెట్టి… మీ ఇద్దరిలో ఎవరు నామినేట్ అవుతారో చెప్పండి అని బిగ్‌బాస్ అడిగాడు. ఇంకేముంది అసలు మజా మొదలైంది.
ఇంట్లో మంచి ఫ్రెండ్స్ అయిన అభిజీత్, హారికకు ఈ నామినేషన్ స్టయిల్ వచ్చేసరికి హారిక తట్టుకోలేకపోయింది. మా ఇద్దరికి పెట్టిన సిట్యువేషన్ అయితే టోటల్లీ అన్‌ఫెయిర్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మధ్యలో ఆమెను కన్సోల్ చేద్దామని వచ్చిన అభిజీత్‌ను హారిక షటప్ అంది. దీంతో అతను షాక్ అయ్యాడు. అసలు ఆమె అలా ఎందుకు అనాల్సి వచ్చింది. బిగ్‌బాస్ చేసిన అంతటి అన్‌ఫెయిర్ పని ఏంటి అనేది రాత్రి ఎపిసోడ్లో తెలుస్తుంది.
ఆరియానా, మెహబూబ్ పోటాపోటీగా నేనుంటే నేనుంటా అన్నారు. మరోవైపు సోహైల్, అవినాష్ పరిస్థితి కూడా అంతే. దివి, లాస్యలో ఎవరేమన్నారో రాత్రి తెలుస్తుంది. ఇంట్లో ఉండాలంటే బాగా ఆడేటోళ్లు కావాలి కాబట్టి… నేను సేఫ్ అవుతా అని మోనాల్‌తో అఖిల్ అన్నాడు. మరి ఈ ఐదు జోడీల్లో త్యాగం చేసి ఐదుగురు నామినేట్ అవుతారో.. లేక ఎవరూ నామినేట్ కాము అని చెప్పి పది మందీ నామినేట్ అవుతారో చూడాలి.