Chiranjeevi: చిరంజీవి ఫ్యాన్స్ అలా ప్లాన్ చేశారా?

ఈ నెల 22వ తేదీన స్టార్ హీరో చిరంజీవి పుట్టినరోజనే సంగతి తెలిసిందే. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయి. ఆచార్య రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావడంతో పాటు ఇతర సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయి. అయితే మెగా ఫ్యాన్స్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ స్పేస్ ను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ట్విట్టర్ స్పేస్ ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రదీప్ ఆ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది.

చిరంజీవి ఫ్యాన్స్ కూడా బర్త్ డే విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ ను ఫాలో అవుతున్నారు. ట్విట్టర్ స్పేస్ లో 15 మంది ప్రముఖులు చిరంజీవితో అనుబంధం గురించి చెప్పనున్నారని తెలుస్తోంది. రికార్డు స్థాయిలో ఫ్యాన్స్ ట్విట్టర్ స్పేస్ లో పాల్గొనే విధంగా ప్లాన్ జరుగుతోందని సమాచారం. చిరంజీవి పుట్టినరోజుకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ వాయిదా పడితే ఆచార్య ఆ డేట్ కు వచ్చే ఛాన్స్ ఉంది.

దసరాకు ఈ సినిమా రిలీజైతే రికార్డు స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రస్తుతం ఆచార్య సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఆచార్య రిలీజ్ డేట్ కు సంబంధించిన క్లారిటీ రానుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus