Chiranjeevi: చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక గౌరవం… ఆ వార్తల్లో నిజముందా?

మెగాస్టార్‌ చిరంజీవికి మరో ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారం దక్కబోతోందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినిమా వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో దీని గురించే చర్చ జరుగుతోంది. ఇది ‘పద్మ’ పురస్కారాల సమయం కాబట్టి కచ్చితంగా చిరుకు వచ్చే పురస్కారం అలాంటిదే అయ్యి ఉంటుందని ఎక్స్‌పెక్ట్‌ చేసి ఉంటారు. అవును నిజమే, చిరంజీవికి పద్మ విభూషణ్‌ పురస్కారంతో సత్కరిస్తారని లెటెస్ట్‌ పుకార్ల సారాంశం. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబోయే పురస్కారాల్లో ఈ మేరకు ప్రకటన ఉండొచ్చని భోగట్టా.

ఈ సంవత్సరం పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి పేరున్నట్లు డిల్లీ నుండి ఇప్పటికే సమాచారం వచ్చిందని అంటున్నారు. చలనచిత్ర పరిశ్రమకు, కరోనా మహమ్మారి సమయంలో చిరంజీవి చేసిన సేవకు గాను ఆయనికు ఈ పురస్కారం ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి పరిశ్రమ కోసం చేసిన సేవ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోవైపు కరోనా సమయంలో బాధితులను రక్షించడానికి చిరంజీవి ఓ ఫండ్ ఏర్పాటు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో వైద్య సదుపాయాలను అందించడానికి అంబులెన్స్ సేవలను ప్రారంభించారు.

బ్లడ్ బ్యాంక్ ఎలానూ ఉంది. దీంతోపాటు అత్యవసర సమయంల అక్కరకొచ్చే ఆక్సిజన్‌ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టారు. ఇంత చేసినందుకు గౌరవంగా చిరుకు ఇప్పుడు పురస్కారం ఇస్తారని టాక్‌. ఇక చిరంజీవికి 2006లో పద్మ భూషణ్ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. ఇప్పుడు వస్తే 18 ఏళ్ల తర్వాత రెండో అత్యున్నత పురస్కారం వచ్చినట్లు అవుతుంది. అయితే ఈ విషయంలో చిరంజీవి (Chiranjeevi) తరఫు నుండి ఎవరూ స్పందించలేదు.

ఇలాంటి పురస్కారాల విషయంలో ప్రకటించేంతవరకు ఎవరూ స్పందించారు. అయితే లీకులు వస్తుంటాయి. మరోవైపు ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వానికి కాస్త సానుకూల పవనాలు వీయాలంటే ఇలాంటివి జరుగుతుంటాయి అనే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే వీటిలో ఎంతవరకు నిజం ఉంది అనేది త్వరలో తేలిపోతుంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus