Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్.. మళ్ళీ ఫాంలోకి వచ్చినట్టేనా..!

దేవి సంగీతం అందించిన సినిమా తమన్ సంగీతం అందించిన సినిమా ఒకేసారి రిలీజ్ అయితే తమన్ సంగీతం అందించిన సినిమానే హిట్ అవుతూ వస్తుంది. 2020 సంక్రాంతికి కనుక చూసుకుంటే తమన్ సంగీతం అందించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం దేవి సంగీతం అందించిన ‘సరిలేరు నీకెవ్వరు’ పై పైచేయి సాధించింది. 2021 సంక్రాంతికి కూడా అంతే..! తమన్ సంగీతం అందించిన ‘క్రాక్’ మూవీ దేవి సంగీతం అందించిన ‘అల్లుడు అదుర్స్’ పై పైచేయి సాధించింది.

అయితే 2023 సంక్రాంతికి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఈసారి తమన్ సంగీతం అందించిన ‘వీరసింహారెడ్డి’ ‘వారసుడు’ చిత్రాల పై దేవి శ్రీ సంగీతం అందించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమాలు రిలీజ్ అవ్వడానికి ముందు తమన్ సంగీతం అందించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా పాటలకే మంచి స్పందన లభించింది. అయితే సినిమాలు రిలీజ్ అయ్యాక ‘వాల్తేరు వీరయ్య’ పాటలకు మంచి ఆదరణ దక్కింది.

‘వాల్తేరు వీరయ్య’ ఆల్బమ్ కు యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి. దీంతో దేవి మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టు స్పష్టమవుతుంది. ప్రస్తుతం దేవి చేతిలో ‘పుష్ప2’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి బడా చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాల మ్యూజిక్ కనుక హిట్ అయితే దేవి మునుపటి ఫామ్లోకి రావడం గ్యారెంటీ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus