Nani: కొత్త సినిమా కోసం పాత విషయాలు తవ్వుతున్న నాని… రివర్స్‌ ఫైర్‌ అయితే…!

  • November 21, 2023 / 03:30 PM IST

పక్కింటి కుర్రాడు, నేచురల్‌ స్టార్‌… అంటూ నానిని తెగ పొగిడేస్తుంటారు అభిమానులు. ఆ మాటకొస్తే సగటు సినిమా ప్రేక్షకుడు కూడా ఇదే మాట అంటూ ఉంటాడు. అందులో నిజం కూడా ఉంది లెండి. అయితే ఆ నేచురల్‌ స్టార్‌ ఇప్పుడు కాంట్రవర్శీలనే నమ్ముకుంటున్నాడా? ఏమో ఆయన చేతలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఏం చేసినా సినిమాకు బజ్‌ రావడం లేదు అనే డౌట్‌ వస్తే వెంటనే ఏదో రకంగా కాంట్రవర్శీకి రావడం మనం టాలీవుడ్‌లో చూస్తుంటాం. ఇప్పుడు నాని కూడా అదే చేస్తున్నాడని టాక్‌.

ఇప్పటివరకు సినిమాల చుట్టూ టాలీవుడ్‌లో వచ్చిన కాంట్రవర్శీలు చూస్తే అవి కూడా ఆ సినిమా చుట్టూనే తిరుగుతాయి. ప్రచారం కూడా అలానే సాగుతుంది. అయితే కొంతమంది తమ సినిమా జోనర్‌కి, పాయింట్‌కి సంబంధం లేని స్టైల్‌లో ప్రచారం చేసి… కాంట్రవర్శీలకు కారణం అవుతుంటారు. కొంతమంది అనుకోకుండా అలా చేసి కాంట్రవర్శీల్లో పడితే.. మరికొంతమంది మాత్రం అలా కావాలనే చేసే వస్తుంటారు. మరి నాని ఎలా చేస్తున్నాడు అనేది నానికే తెలియాలి. లేదంటే ఈ వార్త చదివాక మీరు చెప్పాలి.

పాజిటివ్‌ ప్రచారం సినిమాకు బజ్‌ తీసుకొస్తుంది. అయితే నెగిటివ్‌ ప్రచారం సూపర్‌ బజ్‌ తీసుకొస్తుంది. ఈ విషయం తెలియాలంటే విజయ్‌ దేవరకొండ, విశ్వక్‌సేన్‌ లాంటి వాళ్లను అడిగితే బాగా చెబుతారు. ఇప్పుడు నానిని కూడా అడగొచ్చు అనుకోండి. నాని ప్రజెంట్ మూవీ ‘హాయ్‌ నాన్న’. ఈ సినిమా ప్రచారం ప్రజెంట్‌ ఎలక్షన్‌ ఫీవర్‌ను వాడేశారు. ఇటీవల ఓ ప్రెస్ మీట్ టైపు ప్రమోషన్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. అందులో టీడీపీ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ నారా లోకేష్‌ను ఇమిటేట్ చేశాడు నాని.

‘ఆ ఇద్దరూ రాలేదా’ అంటూ ఓ రెండు ఛానళ్లను లోకేష్ ప్రస్తావించే విధంగా ఆ వీడియో కట్ చేసారు. దీంతో ఎందుకు లేని పోని కాంట్రవర్శీలు అనే మాట మొల్లగా మొదలైంది. ఇదే కాదు గతంలో ‘కిరాణా కొట్టు’ అంటూ ఓ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్‌ కూడా మీరు వినే ఉంటారు. అది పక్కనపెడితే నిన్న అలాంటిదే మరో పొలిటికల్‌ వీడియో వదిలారు. ఇందులో కేసీఆర్‌ను ఇమిటేట్ చేశారు.

అయితే వీడియో ఆఖరులో ‘ఈ మధ్య అందరూ రివ్యూలు చూస్తున్నారు’ అని వాయిస్ ఓవర్ లో వినిపించారు. ఎందుకా అని డౌట్‌ పడేలోపే… ‘అయితే ఏం చేద్దాం, అందరికీ తలా లక్ష ఇద్దామంటావా?’ అంటూ కేసీఆర్‌ స్టైల్‌లో కామెంట్ విసిరారు. అంతేకాదు ‘అయినా సినిమా బాగుంటే చూస్తారు.. లేదంటే లేదు’ అంటూ నానినే అన్నాడు. దీంతో ఈ కౌంటర్‌ మీడియాను ఉద్దేశించే అనుకుంటూ చర్చ జరుగుతోంది. ఆఖరులో ‘మీడియావాళ్లు స్నాక్స్‌ను భోజనంలా చేస్తున్నారు’ అంటూ సుమ నోరు జారి సారీ చెప్పిన విషయాన్ని కూడా నాని (Nani) మరోసారి కెలికి బయటకు తీశారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus