Jawan: ‘జవాన్‌’ పాటను అనిరుధ్‌ పవన్‌ పాటలు కలిపి చేశాడా? నిజమేనా?

  • August 18, 2023 / 07:54 PM IST

‘జైలర్‌’ సినిమా విజయానికి కారణాలేంటి అనే లిస్ట్‌ రాస్తే… రజనీకాంత్‌ పేరు ఫస్ట్‌లో ఉంటే.. ఆ తర్వాత వెంటనే రెండో, మూడో స్థానంలో అనిరుధ్‌ పేరు ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి డౌట్‌ లేదు. ఎందుకంటే ఆ సినిమా కోసం అనిరుధ్‌ ఇచ్చిన సంగీతం అలాంటిది. గూస్‌ బంప్స్‌ వచ్చేలా సంగీతమందించాడు అంటూ తమిళ సినిమా జనాలు గొప్పగా చెప్పుకుంటున్నారు. అలా మంచి జోష్‌ మీదున్న అనిరుధ్‌కు ఒక చిన్న ఝలక్‌ ఇచ్చారు నెటిజన్లు. కారణం ఆయన నుండి వచ్చిన ఓ పాటే. అది కూడా బాలీవుడ్‌ పాట.

షారుఖ్‌ ఖాన్‌ – అట్లీ కాంబినేషన్‌లో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం (Jawan) ‘జవాన్‌’. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబరు తొలి వారంలో రిలీజ్‌ చేయనున్నారు. నిజానికి బాలీవుడ్‌ సినిమాగా మొదలైన ‘జవాన్‌’… ‘పఠాన్‌’ విజయంలో పాన్‌ ఇండియా మూవీ అయిపోయింది. ఆ సినిమా నుండి ఇటీవల ‘ఛలోనా..’ అనే సాంగ్‌ వచ్చింది. ఆ పాట మంచి మెలోడీగా ఉండటంతో సంగీత ప్రియులు తెగ వినేస్తున్నారు. అయితే నెటిజన్లు దానిని ట్రోల్‌ చేసే పనిలో పడ్డారు.

కారణం.. ఆ పాట వింటుంటే ఓ తెలుగు సినిమాలోని, అందులోనూ డిజాస్టర్‌ అయిన సినిమాలోని రెండు పాటలు గుర్తొస్తుండటమే. ‘అజ్ఞాతవాసి’ సినిమాలోని ‘గాలి వాలుగా..’, ‘బయటికొచ్చే చూస్తే టైమేమో..’ పాటలు కలిపి మిక్స్‌ చేస్తే ‘ఛలోనా..’ లా ఉంటుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దీంతో అనిరుధ్‌ మీద ‘సొంత పాటల కాపీ’ అనే మరకపడింది. తమన్‌ విషయంలో కూడా ఇలాంటి విమర్శలు వస్తుంటాయి. ఇప్పుడు అనిరుథ్‌ మీద వచ్చాయి అని చెప్పాచ్చు.

‘జైలర్‌’ సినిమాతో మాంచి పేరు సంపాదించిన మూడ్‌లో ఉన్న అనిరుధ్‌ గాలి తీసేలా ఇప్పుడు ‘ఛలోనా..’ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ పాట తొలిసారి విన్నప్పుడు మిక్సింగ్‌ అనిపించకపోయినా… వింటూ వింటూ ఉంటే అప్పుడు కచ్చితంగా అనిపిస్తుంది అని నెటిజన్లు చెబుతున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ సినిమా నుండి వచ్చిన రెండు పాటలకూ సరైన స్పందన రాలేదు అని అర్థమవుతోంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus