Jr NTR: కొరటాల సినిమా అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్‌ ఖుషీ.. కానీ బాధ కూడా!

ఓ సినిమా అప్‌డేట్‌ వస్తే.. ఆ సినిమా హీరో అభిమానులు చాలా ఆనందపడతారు. ఆ అప్‌డేట్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ఖుషీ అవుతారు. అలా కొత్త సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్‌ అభిమానులు కూడా తమ హీరో సినిమా గురించి ఈగర్‌గా వెయిట్ చేశారు. అయితే కొత్త సంవత్సరం రాగానే వాళ్లు కోరుకున్న అప్‌డేట్‌ అయితే వచ్చింది. కానీ ఆనందంతోపాటు బాధ కూడా వచ్చింది అభిమానులకు. కొరటాల శివ – ఎన్టీఆర్‌ సినిమా చాలా నెలల క్రితమే అనౌన్స్‌ అయ్యింది.

గతేడాది ఫిబ్రవరిలో సినిమా ప్రారంభమవుతుంది అని కూడా చెప్పారు. అయితే, ‘ఆచార్య’ సినిమా ఫలితం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. దీంతో తారక్‌ సినిమాకు బ్రేక్‌లు పడ్డాయి. ఎట్టకేలకు ముహూర్తం జరుపుకున్నా.. షూటింగ్‌ మొదలవ్వలేదు. దీంతో కొత్త సంవత్సరం సందర్భంగా సినిమాను స్టార్ట్‌ చేస్తారా, లేదంటే స్టార్టింగ్‌ డేట్‌ చెబుతారా అని అభిమానులు ఎదురుచూశారు. అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ 30వ చిత్రం గురించి క్లారిటీ వచ్చింది.

నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఈ సినిమాకి సంబందించిన అధికారిక అప్డేట్ ఇచ్చారు. వచ్చే నెలలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుంది అని తీపి కబురు అందించారు. అయితే దాంతోపాటు ఏప్రిల్ 5, 2024న సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. అంటే సినిమా విడుదల కోసం 14 నెలలు ఆగాల్సిందే. 2023లో ఎన్టీఆర్‌ను వెండితెరపై చూడలేం. దీంతో అభిమానులకు ఆనందం, బాధ.. ఒకేసారి వచ్చినట్లు అయ్యింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా అప్‌డేట్‌ వచ్చింది అని ఆనందపడాలో, లేక సినిమా వచ్చే ఏడాది వస్తుందని బాధపడాలో అర్థం కావడం లేదు. ఎన్టీఆర్‌ 30 అంటూ నానుడిలో ఉన్న ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజిలో విడుదల చేయనున్నారు. దీని కోసం బాలీవుడ్ నుండి నాయికను కూడా తీసుకొస్తున్నారు. విలన్‌గా సౌత్‌లో స్ట్రాంగ్‌ యాక్టర్‌ను తీసుకొస్తారట. వీటిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటున్నారు. చూద్దాం ఎందుకు ఇన్ని రోజులు తీసుకుంటున్నారో ఈ సినిమా కోసం.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus