బాలీవుడ్ కు “సైజ్ జీరో”ను పరిచయం చేసిన స్లెండర్ బ్యూటీ కరీనా కపూర్ నిజంగా గర్భం దాల్చిందో లేదో తెలియదు కానీ.. బాలీవుడ్ మీడియా మాత్రం “కరీనా ప్రెగ్నెన్సీ”ని కన్ఫర్మ్ చేసేస్తున్నాయి. ఈ విషయంలో కరీనా చాలా చిరాకు పడుతుందని తెలుస్తోంది.
ఎంత సెలబ్రిటీలం అయినప్పటికీ.. తమకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది. నేను గర్భం దాల్చడం లేదా తల్లి అవ్వడం అనే విషయం పూర్తిగా నా పర్సనల్ మేటర్. అలాంటి విషయాల్లో కూడా మీడియా ఈ విధంగా విచిత్రమైన కథనాలు వ్రాస్తుండడం నాకు అస్సలు నచ్చడం లేదని తన సన్నిహితుల వద్ద చెప్పుకొంది.
అయితే.. పెళ్ళయ్యాక కడుపు రావడం, పిల్లలు పుట్టడం అన్నది సాధారణ విషయం. దానికోసం ఇంత హడావుడి అవసరం అంటారా?!